ప్రజా కంటకుడు జగన్ పదేళ్ళపాటు రాజకీయాల వైపు చూడకూడదు

• జగన్ ఓడిపోయే యద్ధం ఇస్తాం… కాచుకోండి
• యుద్ధం అంతిమ లక్ష్యం శాంతి… సుస్థిరత… అభివృద్ధి
• ఆంధ్రప్రదేశ్ సుస్థిరత.. సమైక్యత… సంపద లక్ష్యం
• దేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతాం
• ఎన్నికల సంగ్రామానికి 100 రోజులే … కలసికట్టుగా కదం తొక్కుదాం
• నాతోపాటు నడిచిన ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటా… తగిన గౌరవం ఇస్తా
• నిర్ణయాలను సందేహించే వారిని వైసీసీ కోవర్టులుగా భావిస్తాం
• జనసేన – టీడీపీ ప్రభుత్వాన్ని స్థా పిస్తున్నాం
• ఏపీ భవిష్యత్తు కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తా ను
• టీడీపీకి వెనుక నడవడం లేదు పక్కన నడుస్తున్నాం
• పొత్తు ధర్మం పాటించి, ప్రజల్ని చైతన్యవంతం చేద్దాం
• త్వరలోనే నియోజకవర్గ నాయకులు, ఇంఛార్జులతో సమావేశాలు
• జనసేన విస్తృతస్థా యి సమావేశంలో పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్

‘మరో 100 రోజుల్లో జగన్ కోరుకు నే యుద్ధం ఇస్తాం… జగన్
ఓడిపోయే యుద్ధం అది. యుద్ధం తాలుకా అంతిమ లక్ష్యం- ఆంధ్రప్రదేశ్ శాంతి,
సుస్థిరత, అభివృద్ధి. దేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దడమే
యుద్ధంలో అసలు విజయం. జగన్ చెప్పినట్లు ఇది కురు క్ష్రేత్ర యుద్ధం కాకపోవచ్చు
కానీ.. ఏపీ భవిష్యత్తును నిర్దేశించేది మాత్రం అవుతుంది’ అని జనసేన పార్టీ అధ్యక్షులు
శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు . భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయంలో ఎలాంటి
తప్పులు జరగకూడదు అనేది జనసేన అంతిమ లక్ష్యమని స్పష్టం చేశారు . దశాబ్ద కాలంపాటు జగన్ రాజకీయాల వైపు చూడకూడదు… మంచి మనిషిగా మారి, ప్రజలకు చేసిన ద్రోహంపై
పశ్చాత్తా పపడిన రోజు మళ్లీ రాజకీయాల్లోకి వచ్చేలా చూద్దా మని చెప్పారు . శుక్రవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విస్తృత స్థా యి సమావేశంలో
ఆయన మాట్లాడారు. సమావేశంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు పాల్గొన్నారు . ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు
మాట్లాడుతూ “నేను ఏ రాజకీయ వ్యూహం వేసినా, నిర్దుష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లినా అది పూర్తి స్థా యిలో ప్రజలకు మేలు చేసేదిగా ఉంటుంది. రాజకీయాల్లో ప్రత్యర్థి
బతకాలి. అంతేగానీ సంపూర్ణంగా ప్రత్యర్థు లను చంపేసి మొత్తం నేనే పెత్తనం చేయాలి అనుకోవడం తప్పు. వైసీపీ ప్రభుత్వ హయంలో సోషల్ మీడియాలో ఒక
పోస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెడితే తప్పు. వారికి నచ్చకపోతే మెగాస్టా ర్ ను బెదిరించగలరు… తమిళ సూపర్ స్టా ర్ ను భయపెట్టగలరు. వైసీపీ నాయకులను
పొగడకపోయినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా- బూతులు, బెదిరింపులు ఎంతటి వారికైనా తప్పవు. ఇలాంటి వైసీపీ దాష్టీకాలకు చెక్ పెట్టాలనే
కోణంలోనే వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించాం. జగన్ అనే వ్యక్తి ప్రజలకు అన్ని రకాలుగా మేలు చేసి, రాష్ట్రాన్ని అద్భుతంగా
ముందుకు తీసుకువెళ్తూ.. మహా నాయకుడిగా పరిపాలన చేస్తే కచ్చితంగా స్వతంత్రంగానే పోటీ చేసే వాళ్లం. కానీ రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే, ప్రజల
వేదనను పరిశీలిస్తే ఈ ప్రభుత్వం మళ్లీ రాకూడదు అనేలా పరిస్థితులు ఉన్నాయి. దాని కోసమే ప్రజల అభీష్టం మేరకు కలిసి పోటీ చేస్తున్నాం.
మరోసారి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి రాకూడదు అనే బలమైన సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. వచ్చేది కచ్చితంగా జనసేన –
తెలుగుదేశం ప్రభుత్వం. దీనిలో తిరుగులేదు.
• ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఎక్కడ అంటే దిక్కులు చూసే పరిస్థితి
ఆంధ్రప్రదేశ్ సుస్థితర, సమైక్యత, సంపద అనేవి ముందున్న లక్ష్యాలు. ఏపీని అగ్రగామిగా తీర్చిదిద్దా ల్సిన పాలకులు రాష్ట్రానికి కనీసం
రాజధాని ఎక్కడో కూడా తేల్చలేని పరిస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టేశారు . ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదీ అంటే ఐదు దిక్కులు ఒకరు, మూడు దిక్కులు
మరొకరు చూసే విచిత్ర పరిస్థితులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా పయనించాలి అంటే అమరావతే రాజధానిగా ఉండాలి.
ఉత్తరాంధ్ర అభివృద్ధి కారిడార్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. రాయలసీమ ప్రాంతాన్ని ఏవియేషన్, హార్టికల్చర్, డ్రిప్ ఇరిగేషన్, విద్యా , పారిశ్రామిక
హబ్ గా తయారు చేయాలి. కోస్తా ప్రాంతాన్ని సంప్రదాయ పంటలతోపాటు ప్రాసెసింగ్ యూనిట్లకు కేంద్రం చేయాలి. అన్ని రంగాలుగా రాష్ట్రాన్ని
అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లడానికి పటిష్టమైన ప్రణాళికలు జనసేన వద్ద సిద్ధంగా ఉన్నాయి.
• 100 రోజులు… ఐక్యతతో ముందుకు వెళ్దాం
ఎన్నికలకు ఇప్పటి నుంచే 100 రోజుల ప్రణాళిక వేసుకోండి. ప్రతి రోజు మీరు వెళ్లే ప్రాంతాల్లో, చేసే కార్యక్రమాల్లో ప్రజలను చైతన్యవంతం
చేయడమే లక్ష్యంగా పెట్టుకోండి. మనం ఎన్ని సిద్ధాంతా లు చెప్పినా, వ్యూహాలు పన్నినా ఎన్నికల సమయంలో ఎలక్షనీరింగ్ అనేది కీలకం.
ఓటర్లను మనతో పాటు పోలింగ్ బూత్ వరకు తీసుకురావడం చాలా అవసరం. ఓటర్లలో మనపై నమ్మకాన్ని పెంచేలా పనిచేయాలి. గత
ఎన్నికల్లో మన కోసం నిలబడిన వారికి మనతోపాటు ఉన్నవారికి కనీసం టీ, కాఫీలు ఇవ్వలేని పరిస్థితులు నా దృష్టికి వచ్చా యి. జీరో బడ్జెట్
అంటే మనతోపాటు వచ్చిన వారికి కడుపు మాడ్చేయడం కాదు. ఎలక్షన్ కమిషన్ సైతం కొంత డబ్బు ఖర్చు పెట్టుకోవచ్చు అనే మినహాయింపు
ఇచ్చింది. కనీసం దానిని కూడా ఖర్చు పెట్టలేని వారు నాయకులు ఎలా అవుతారు . ఈ 100 రోజుల్లో పార్టీ బలం లేని చోట బలం ఎలా
పెంచుకోవాలి, పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి అన్న దానిపై దృష్టి పెడదాం. 2019లో ఎంతమంది నిజమైన ఎలక్షనీరింగ్ చేశారో నాకు
తెలుసు. 2019 ఎన్నికలను నాకు నేను విధించుకునే శిక్ష గానే భావిస్తా ను. ప్రతికూల సమయంలో నాతోపాటు నడిచిన ప్రతీ ఒక్కరిని గుర్తు
పెట్టుకుంటాను. తగిన గౌరవం ఇస్తా ను. 2019 ఎన్నికల తరువాత నాతోపాటు నడిచి పార్టీ సిద్ధాంతా లను ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రతీ ఒక్కరినీ
నా వాళ్లుగా భావిస్తా ను. మనం అనుకున్నట్లుగా అంతా జరిగి… పూర్తి స్థా యి సమన్వయంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అందరికి తగిన
గౌరవం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎంపీ, ఎమ్మెల్యే స్థా యి వరకు మాత్రమే ఆలోచిస్తున్నారు . వివిధ కార్పొరేషన్లు, ప్రజలకు దగ్గరగా ఉంటే ఎన్నో
పదవుల ద్వారా సేవ చేయవచ్చని గుర్తు పెట్టుకోండి. సంక్షేమాన్ని నేను బలంగా నమ్ముతా ను. ఆపదలో ఉన్న పేదలకు ఆప్త హస్తం అందడం
అవసరం. సొంత డబ్బులనే పేదలకు ఇచ్చినవాడిని. ప్రజా ఖజానాకు ఇంకెంత న్యాయం చేస్తా నో అర్థం చేసుకోండి. నాయకులు సమన్వయంతో
క్రమపద్ధతిలో ప్రజలతోనూ, మీడియాతోనూ మాట్లాడండి. నేను తీసుకునే ఏ నిర్ణయం అయినా అందరికీ మంచి జరుగుతుంది. ప్రజలకు మేలు
జరుగుతుంది. నేను విశాల దృక్పథంతో తీసుకునే నిర్ణయాలు, వాటి లక్ష్యాలు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ
నడ్డా గారికి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు గారికి అర్ధమవుతున్నాయి. నేను తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సందేహించి, నిర్ణయాలను
తప్పుపట్టే నాయకులు నాకు అవసరం లేదు. పరిపూర్ణంగా నమ్మి రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయాలను ఆచరించే వ్యక్తులనే విశ్వసిస్తా ను.
ఇప్పటి కీ కొన్ని ప్రాంతాల్లో మన నాయకులు వైసీపీతో పోరాడుతున్నామా? లేక మనలో మనమే పోట్లాడుకుంటున్నామా? అన్నట్లుగా పరిస్థితి ఉంది.
కొందరు మనలోని వాళ్లే మనకు వెన్నుపోటు పొడవడం నేను ఉపేక్షించను. రాజకీయాల్లో ఎవరిని ఎవరు ప్రభావితం చేయరు. రాజకీయాలను
ఇష్టంగా బాధ్యతగా తీసుకోవాలి. ఇక మీదట నా నిర్ణయాలను సందేహించేవారు… పార్టీ గురించి ఇష్టానుసారం మాట్లాడేవారిని వైసీపీ కోవర్టులుగానే
చూస్తా ను. వైసీపీ దోపిడీ వ్యవస్థను నిలువరించడానికి చేస్తున్న పోరాటం ఇది. 100 రోజుల్లో ఎంత పోరాటం చేయాలి? ఎలా ముందుకు వెళ్లాలి అనేది
నిర్దేశించుకుందాం. కేంద్రం, బీజేపీ మనకు అండగా ఉంటాయి. పొత్తులపై ఏకీభవించిన అంశా లను అంతర్గతంగా మాట్లాడుకొని సరిచేసుకుందాం.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.