*అవినీతి అరాచక పాలనను అంతమొందించి ప్రజా పరిపాలన తెచ్చుకుందాం
*పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మన ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుకుందాం
రాజానగరం నియోజకవర్గం : రాజానగరం మండలం నరేం ద్రపురం గ్రామంలో జనం కోసం జనసేన మహాపాదయాత్రలో భాగంగా జనసేన పార్టీ ఇంచార్జి బత్తు ల బలరామకృష్ణ, నా సేన కోసం నా వంతు కో-ఆర్ డినేటర్ శ్రీమతి బత్తు ల వెం కటలక్ష్మికి నరేం ద్రపురం ప్రజానీకం బ్రహ్మ రధం పట్టారు. అడుగడుగునా హారతులు పడుతూ, తీన్మా ర్ డప్పు లతో జనశ్రేణులు, ప్రజలు ఘన స్వా గతం పలికారు. కార్య క్రమంలో బాగంగా బత్తు ల గ్రామంలో వంగవీటి రంగా విగ్రహానికి పూల మాల వేసి నివాళు లు అర్పిం చారు. అనంతరం నరేం ద్రపురం గ్రామ జనసేన నాయకు లు, జనసైనికు లు, గ్రామ ప్రజలు బత్తు ల దంపతులకు చి రు సత్కా రం చేసారు.