• ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే రైతుల ఇబ్బందికి కారణం
• విపత్తు సమయంలో మీనమేషాలు లెక్కించకూడదు
• యుద్ధ ప్రాతిపది కన ఉపశమన చర్యలు చేపట్టాలి
• ప్రభుత్వం తక్షణం స్పందించాలి
• జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్
• టీడీపీ నేత శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తో కలసి తెనాలి సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం
మిగ్ జాం తుపాను కారణంగా వ్యవసాయం అతలాకుతలం అయిపోయిందని, ప్రభుత్వం రైతుల కష్టాలను గ్రహించి యుద్ధ ప్రాతిపదికన ఉపశమన చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే రైతులు ఇబ్బందులు పడుతున్నారని స్పష్టం చేశారు. విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి సకాలంలో స్పందన లేకపోతే రైతు కుటుంబాలు చితికిపోతాయన్నారు. పంట పొలాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం టీడీపీ ఇంఛార్జ్ శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారితో కలసి తెనాలి సబ్ కలెక్టర్ ను కలిశారు. మిగ్ జాం తుఫాను కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, పంట పూర్తిగా నీటిలో మునిగి ఉన్నందున రైతులు మరింత ఇబ్బందులు పడుతున్నారని సబ్ కలెక్టర్‌కి తెలిపారు. ఇందుకు సంబంధించి వినతి పత్రం అందజేశారు. డ్రైయిన్లకు మరమ్మతులు చేపట్టి నీరు వెంటనే తొలగించే ఏర్పాటు చేయాలని, పంట నష్టం మీద అంచనాలు వేసే ప్రక్రియ తక్షణం చేపట్టాలని కోరారు. ఓటరు జాబితాలో అవకతవకలు సరిచేసేందుకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా అవకతవకలను తెలియచేస్తూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “విపత్తు సమయంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. యంత్రాంగం స్పందించి పంట పొలాల్లో ఉన్న నీటిని తొలగించే ఏర్పాటు చేయాలి. అందుకు అవసరం అయిన నిధులు వెంటనే కేటాయించి పనులు చేయిస్తే కొంత వరకు ఉపయోగం ఉంటుంది . ఈ ఏడాది వ్యవసాయం మొదలు పెట్టిన దగ్గర నుంచి రైతు పడిన కష్టం వర్ణణాతీతం. నీరు ఆలస్యంగా అందడమే ఇప్పుడు ఈ కష్టాలకు కారణం. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మూలంగా రైతులు నష్టాల పాలవుతున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి సాయం చేయాలి. పంట మురుగు నీటిపారుదల వ్యవస్థను సరిచేయాలి. ప్రధాన డ్రెయిన్లకు మరమ్మతులు చేయాలి. పండించిన ప్రతి గింజా కొనుగోలు చేసే ఏర్పాటు చేయాలి.