డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం, స్థానిక జనసేనపార్టీ కార్యాలయంలో రాష్ట్ర జనసేనపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ గురువారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మో హన్ రెడ్డి ప్రతిపక్షాలను అనగదొక్కడానికి చేస్తున్న కక్ష సాధింపు చర్యలు తిరిగి అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని పితాని బాలకృష్ణ అన్నారు. 10 కిలోమీటర్లు దూరాన్ని కూడా హెలికాప్టర్లో ప్రయాణించే జగన్మో నరెడ్డి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటనను అడ్డుకోవడానికి హెలికాప్టర్ లాండింగ్‌కు అనుమతి నిరాకరించడంపై బాలకృష్ణ మండిపడ్డారు. ఈ విధమైన కక్ష్య సాధింపు చర్యలలో పాలు పంచుకుంటున్న అధికార పార్టీ నాయకులతో పాటు, అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండాలి హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో జనసేన, టిడిపిలు అధికారంలోకి రావడం ఖాయం. మతిభ్రమించి అభద్రతాభావంతో పిచ్చి చేస్టులు చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి కుట్రలకు తగిన సమాధానం మాప్రభుత్వంలో తగిన బుద్ది చెబుతాం. జగన్మో హన్ రెడ్డి చెంప దెబ్బలు, చెప్పు దెబ్బలు తినడం ఖాయమని పితాని ఘాటుగా హెచ్చరించారు.