మదనపల్లె, జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి అన్ని అర్హతలు ఉండి కూడా మదనపల్లెని జిల్లాగా ప్రకటించకుండా ఏ మాత్రం సౌకర్యం లేని వేరొక చోటికి తరలించడం మా అందరి మనోభావాలు దెబ్బ తీశాయని అన్నారు . మనుషుల వ్యక్తిత్వాలను దెబ్బ తీయడం, మానసిక క్షోభకి గురి చేయడం ఈ ప్రభుత్వానికి అలవాటు అయిపోయిందని రాబోయే ఎన్నికల్లో రాజంపేట పరిధిలో తంబళ్లపల్లి , మదనపల్లె, పుంగనూరు , పీలేరు ప్రజలు కలసి ఎంపీ మిథున్ రెడ్డికి తగిన బుద్ది చెబుతామని అన్నారు . ముఖ్యంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ వ్యక్తి గత జీవితం గురించి మాట్లాడటం, ప్యాకేజీ స్టార్ అనడం తప్ప ఈ ప్రభుత్వానికి అభివృద్ధి చేయడం రాదని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దగ్గర ఎంత ప్యాకేజీ తీసుకున్నారని నువ్వు , మీ చెల్లి , మీ అమ్మ కలిపి తెలంగాణ వైసిపి అంటూ ప్యాకేజీ అందుకే నీకు అర్దణా జగన్ అని నామకరణం చేస్తున్నాం అని అన్నారు . మదనపల్లె జిల్లా కోసం బి.కొత్తకోటలో నిర్వహించిన సభకు హజరైన అఖిల పక్ష నాయకులపై పెట్టిన కేసులకు కోర్టుకి హాజరైన జనసేన పార్టీ రాయలసీమ కోకన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి, పర్వీన్ తాజ్, మధుబాబు, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం , సురేంద్ర, ఆర్ జె వెంకటేష్, రాష్ట్ర చేనేత విభాగ నాయకులు అడపా సురేంద్ర, అర్జున, తోట కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు .