అనకాపల్లి జిల్లా, పాయకరావుపేట నియోజకవర్గం , ఎస్ రాయవరం మండలం ధర్మవరం-అగ్రహరం గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం అగ్నికి ఆహుతి అయిపోయి కట్టు బట్టలతో మిగిలిన నిరుపేద కుటుంబానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు మరియు రూపాయలు 10 వేలు ఆర్ధిక సాయం జనసేన పార్టీ నాయకురాలు మాజీ ఎమ్మెల్సి లక్ష్మి శివకుమారి చేతుల మీదుగా కుటుంబానికి అందజేయడం జరిగింది. కుటుంబానికి ఎల్లప్పుడూ జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ యువ నాయుకులు లింగంపల్లి జ్యోతి కుమార్, ధర్మవరం గ్రామ జనసేన నాయుకులు, జనసైనికులు పాల్గొన్నారు.