• ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే వేధిస్తారా?
శతఘ్ని న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు పొరుగు రాష్ట్రాల కంటే వెయ్యి
రూపాయలు ఎక్కువ ఇస్తానని ప్రతిపక్ష నేతగా హామీలు ఇచ్చి… అధికారంలోకి వచ్చాక వెయ్యి
రూపాయలు తక్కువ వేతనాలు ఇవ్వడాన్ని ఏమనాలి? మాట తప్పడం అంటే ఇదే. ఈ విషయాన్నే గుర్తు
చేసి నిరసన తెలియచేస్తుంటే వేధిం పులకు గురి చేయడం పాలకుల నైజాన్ని తెలియచేస్తోందని
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో విమర్శించా రు. అంగన్వాడీ
కేంద్రాల తాళాలు బద్దలుకొట్టి పంచనామాలు చేస్తామని చిరుద్యోగులను బెదిరిస్తు న్నారు.
రాష్ట్రంలో ఉన్న 52 వేల అంగన్వాడీ కేంద్రాల్లో లక్ష మందికిపైగా మహిళలు కార్యకర్తలుగా, హెల్పర్లుగా నామ మాత్రపు వేతనాలకే పని చేస్తు న్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచా లి. అదే విధంగా సుప్రీం కోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ విధానాన్ని వీరికి వర్తిం ప
చేయాలి. ఈ చిరుద్యోగుల ఆర్థిక ఇబ్బందులపై మానవతా దృక్పథంతో స్పందించా లి. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు చేస్తు న్న నిరసన
కార్యక్రమాలకు జనసేన పార్టీ మద్దతు ప్రకటిస్తుంది. వారి సమస్యలను తక్షణమే పరిష్కరించా లని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాం డ్ చేస్తున్నాం అని
జనసేనాని స్పష్టం చేశారు.