ఆంధ్రప్రదేశ్ పరువును అంతర్జాతీయ స్థాయిలో తీసిన జగన్ సర్కారు

• రాష్ట్రాన్ని బ్యాం కులు బ్లా క్ లిస్టు లో పెట్టడం దౌర్భాగ్యం
• భవిష్యత్తులోనూ రాష్ట్రానికి రుణాలు రాకుం డా చేశారు
• నాలుగున్నర ఏళ్లలో కీలక ప్రాజెక్టులో 4.89 శాతమే పూర్తి
• కేంద్రం, బ్యాం కులు ఎన్నిసార్లు హెచ్చరించినా స్పందిం చని ప్రభుత్వం
• బ్యాం కుల నుంచి రెడ్ ఫ్లాగ్ నోటీసులు
• కీలకమైన రోడ్ల ప్రాజెక్టులను రద్దు చేసుకున్న బ్యాం కులు
• రోడ్లు వేయలేక… ప్రాధాన్యత తెలియక అయోమయం
• మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

మౌలిక సదుపాయాల కల్పన అనేది రాష్ట్రాభివృద్ధికి ఎంతో కీలకం.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రహదారుల పరిస్థితి అధోగతి పాలైంది. గ్రామాల నుంచి
గ్రామాలకు వెళ్లే రోడ్ల దగ్గర నుంచి జిల్లాల నుంచి జిల్లాలు వెళ్లే రోడ్లు సైతం అధ్వానంగా
కనిపిస్తు న్నాయి. ప్రయాణం మాట దేవుడెరుగు… వాటి మీద నడవాలన్నా పెద్దపెద్ద గుం తలతో
భయపెడు తున్నాయి. ఆఖరికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు సైతం మన రాష్ట్ర రోడ్ల దుస్థితిని వారి రాష్ట్ర రోడ్లతో పోల్చి హేళనగా
మాట్లాడుకొనే దుస్థితి వచ్చిం ది. రోడ్లకు సంబంధించి చేపట్టిన అతి పెద్ద ప్రాజెక్టులో గత నాలుగున్నర ఏళ్లలో 4.89 శాతం మాత్రమే పూర్తి చేశారంటే ఈ
పరిపాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చ’ని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. శుక్రవారం మంగళగిరిలోని జనసేన
పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భం గా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ‘‘రహదారుల
నిర్మాణం కోసం రుణాలు ఇచ్చే అంతర్జాతీయ స్థాయి బ్యాం కుల వద్ద కూడా వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పరువును అంతర్జాతీయ స్థాయిలో తీసేసిం ది.
బ్యాం కులు రోడ్లను వేసేం దుకు ఇచ్చిన రుణాలను సైతం ఈ ప్రభుత్వం పక్కదారి పట్టించిం ది. చేతకానితనం, దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో తెలియని
అయోమయం వెరసి బ్యాం కులు ఇచ్చిన రోడ్ల రుణాలను వేర్వేరు పథకాలకు మళ్లించడంతో పలుమార్లు ఆయా బ్యాం కులు హెచ్చరికలు చేశాయి.
అయినప్పటికీ ప్రభుత్వం తీరులో మార్పు రాకపోవడంతో రుణాలను నిలుపుదల చేసి, రోడ్ల ప్రాజెక్టులను అర్ధంతరంగా రద్దు చేసుకున్నాయి. ఇదీ వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకం.
ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశవ్యాప్తంగానే కాదు… ప్రపంచవ్యాప్తంగా కూడా తలదిం చుకునే పరిస్థితిని కల్పించా రు. రోడ్లను ఎప్పటికప్పుడు ఉన్నతీకరించాల్ సిన
ప్రభుత్వం వాటి స్థాయిని తగ్గించి ప్రజలకు నరకం చూపుతోం ది.

  • రెండు బ్యాం కుల రుణాలను వాడేసుకున్న వైసీపీ ప్రభుత్వం
    ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాం కు, న్యూ డెవలప్మెంట్ బ్యాం కులు రోడ్ల నిర్మాణం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఇచ్చారు. రహదారులను అద్భుతంగా తీర్చిదిద్దితే
    ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి జరిగి, జీవన ప్రమాణాలు పెరుగుతాయనే భావనతో ఈ రెండు బ్యాం కులు రుణాలు ఇచ్చాయి. బ్రిక్స్ దేశాల ఒప్పం దంలో భాగంగా బ్రిక్స్ లోని 5 దేశాల్లో
    భారతదేశం ఒకటిగా ఉండటంతో న్యూ డెవలప్మెంట్ బ్యాం కు మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా రుణాలు ఇస్తోంది. బ్యాం కు ఇచ్చే రుణాలకు కేంద్ర ప్రభుత్వం గ్యారెం టీ ఇస్తుంది.
    రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలోని వివిధ పనులకు సంబంధించి బ్యాం కు రుణం కోసం ప్రతిపాదనలు పంపితే, కేంద్ర ప్రభుత్వం దానికి గ్యారెం టర్ గా ఉంటూ బ్యాం కు రుణం ఇచ్చేలా
    చేస్తుంది. ఈ బ్యాం కులు రోడ్ల అభివృద్ధికి ఇచ్చిన రుణాలను వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కేంద్రం ఎన్నిసార్లు హెచ్చరించినా ఫలితం లేకపోయిం ది. వైసీపీ ప్రభుత్వం
    వచ్చాక రివర్స్ టెండరిం గ్ ద్వారా న్యూ డెవలప్మెంట్ బ్యాం కు ఇచ్చిన రుణాలకు సంబంధించి జరిగిన పనుల్లో రూ.85 కోట్లు ఆదా చేశామని ఢాంబికాలు పలికిన వైసీపీ ప్రభుత్వం తన
    హయాం లో చేసిన నిర్వాకాలతో ఏకంగా సదరు బ్యాం కు భవిష్యత్తులో రుణాలు కూడా ఇవ్వని పరిస్థితిని తెచ్చారు.
  • పూర్తి చేయలేక.. బ్యాం కు హెచ్చరికలు పట్టిం చుకోని సర్కారు
    రోడ్ల నిర్మాణం విషయంలో రాష్ట్రంలో రెండు రకాల ప్రాజెక్టులు ఉన్నాయి. ఏపీ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ రీ కనస్ట్రక్షన్ ప్రాజెక్టులో 1231 కిలోమీటర్లు రోడ్లు సిం గిల్ లైను నుంచి డబుల్ లైను
    వేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీం తో పాటు మండలం నుంచి మండలం కలిపేవీ, గ్రామాలను అనుసంధానిం చే రోడ్లు 1297 కిలోమీటర్లు వేసేం దుకు కూడా ప్రతిపాదనలు
    తీసుకొచ్చారు. దీనిలో 18 వంతెనల నిర్మాణాలు కూడా ఉన్నాయి. మొత్తం ఈ పనులకు సంబంధించి న ప్రాజెక్టు వ్యయం రూ.6,400 కోట్లు. దీనిలో న్యూ డెవలప్మెంటు బ్యాం కు ఇచ్చిన
    రుణం రూ.4,771.56 కోట్లు. ఈ మొత్తానికి కేంద్రం గ్యారెం టీగా ఉంటే రాష్ట్రానికి వచ్చిన సావరిన్ లోన్ ఇది. ఈ ప్రాజెక్టులో మిగిలిన రూ.1,668 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా
    ఈ ప్రాజెక్టులో పెట్టాలి. 2021, జనవరిలో ప్రాజెక్టు మీద జరిగిన ఒప్పం దంలో భాగంగా 5 ఏళ్లలో మొత్తం ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి. అయితే ఒప్పం దం జరిగి ఏళ్లు పూర్తి అవుతున్నా
    రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కిం ద రూపాయి వెచ్చిం చలేదు. బ్యాం కు సైతం మొదటి విడతగా రూ.245 కోట్లు విడుదల చేసిం ది. అయినా పనులు జరగకపోవడంతో కేంద్ర ఆర్థిక శాఖ
    సైతం పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు పంపిం ది. మీ వల్ల చెడ్డపేరు వస్తోందని పలుమార్లు గట్టిగా చెప్పినా ప్రభుత్వానికి చెవికి ఎక్కలేదు. మొత్తం ప్రాజెక్టులో 4.89 శాతం
    పూర్తి చేసినట్లు బ్యాం కుకు నివేదిక పంపారు. కంగు తిన్న బ్యాం కు ప్రభుత్వ అసమర్ధతతో ప్రాజెక్టును రద్దు చేసుకొని, బయటకు వెళ్లిపోయారు. దీం తో గ్రామీణ ప్రాంతాల్లో రావాల్సిన
    రోడ్లు, వంతెనలకు వైసీపీ ప్రభుత్వం ఇలా మంగళం పాడేసిం ది.
  • ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టిమెంట్ బ్యాం కు నిధులనూ పక్కదారి పట్టించా రు
    రోడ్లకు నిధులు ఇచ్చిన ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టిమెంట్ బ్యాం కు (ఏఐఐబీ) సైతం రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి రుణాలు ఇచ్చిం ది. వీరి వద్ద సైతం రూ.4,395.65 కోట్లు
    ప్రతిపాదనలతో రోడ్లను నిర్మించేం దుకు రుణాలు తీసుకుం ది. బ్యాం కు రూ.3,003 కోట్లు రుణం రాష్ట్రానికి ఇస్తే, దీనిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా కిం ద రూ.1392 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ
    ప్రాజెక్టు ఒప్పం దం గత ప్రభుత్వం లో 2018లో జరిగిం ది. మొత్తంగా 6 వేల కిలోమీటర్ల మేర రోడ్లును నిర్మించాల్ సి ఉంది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.