రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీ వర్గం మారణకాండను సృష్టిస్తున్నారు… JanaSena Party మద్దతుతో గ్రామ సర్పంచ్ గా గెలిసిన వారిపై హత్యాయత్నం చేయడం వారి రాక్షస పాలన ని సూచిస్తోంది…..
ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం ప్రయత్నిస్తున్నారని భీమవరం నియోజకవర్గం,వీరవాసరం మండలం,దూసనపూడి గ్రామ సర్పంచ్ గా జనసేన పార్టీ మద్దతుతో గెలిసిన యర్రంశెట్టి నాగసాయి గారిపై వైఎస్ఆర్ సీపీ వర్గం మారణాయుధాలతో హత్యాయత్నానికి పాల్పడడం జరిగింది….చికిత్స నిమిత్తం ఆయనని ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చడమైంది….ఆయనని ఈ రోజు పరామర్శించి ఆయనకి ధైర్యం చెప్పి,జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది…