
రాజోలు: మలికిపురం మండలం, కేశనపల్లి బుద్ధనగర్‌లో డా. బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మండల స్థాయి చదరంగం పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సండే చర్చి సమీపంలో, భారత్ గ్యాస్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ ప్రారంభించారు.
అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని యువతలో మేధస్సు, వ్యూహాత్మక ఆలోచనలను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. మండలంలోని పలు ప్రాంతాల నుంచి పాల్గొన్న క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనలు సమాజానికి మార్గదర్శకమని, యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువకులు, క్రీడా ప్రోత్సాహకులు పాల్గొని పోటీలను విజయవంతం చేశారు.