పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు “కనపర్తి మనోజ్ కుమార్” ఆధ్వర్యంలో పొన్నలూరు మండలంలో సుంకిరెడ్డిపాలెం మరియు రామన్నపాలెం పరిధిలో ఉన్నటువంటి “పెద్దచెరువు” కి సంబంధించిన మరమ్మతులు చేయమని, అధిక వర్షాలు పడటం వల్ల తెగిపోయిన చెరువుకట్ట గండి పూడ్చమని, అదేవిధంగా తూముని కూడా ఏర్పాటు చేయమని, “ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సబ్ డివిజన్” అధికారులకు ఈ రోజు కందుకూరు లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, అతి తొందరలో కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరుగుతుంది, ఈ కార్యక్రమంలో పొన్నలూరు మండలం జనసేన పార్టీ నాయకులు సుబ్రమణ్యం నాయుడు, శ్రీను, గఫూర్, తిరుమల్ రెడ్డి, ఖాజావలి, భాష , భార్గవ్ , సాయి, మహబూబ్ బాషా, వేణు, అజయ్, మొదలైన వారు పాల్గొన్నారు.