దూడల ప్రదర్శన కార్యక్రమం విజయవంతం

పిఠాపురం నియోజకవర్గం: పిఠాపురం మండలం, చిత్రాడ గ్రామంలో “పెయ్య దూడల ఉత్పత్తి పథకం” మరియు “జాతీయ కృత్రిమ గర్భదారణ కార్యక్రమం&లేగ దూడల ప్రదర్శన” విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చి నాయుడు సూచనలతో జరిగింది.

ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, రైతులు మరియు పశుసంవర్ధక శాఖ అధికారులు పాల్గొన్నారు. పశుసంవర్ధక శాఖ ఉపసంచాలకులు అంబేద్కర్, కరప సహాయ సంచాలకులు సురేష్ బాబు, శంఖవరం సహాయ సంచాలకులు మనోజ్, పిఠాపురం సహాయ సంచాలకులు రమేష్ చంద్ర, పిఠాపురం మండల పశువైద్యాధికారి రంజిత్ సింగ్, ఉప్పాడ కొత్తపల్లి మండల పశువైద్యాధికారి టి. శ్రీమన్నారాయణ, డి.ఎల్.డి.ఏ నవీన్ ఈ కార్యక్రమంలో హాజరయ్యారు.

పిఠాపురం మండలంలోని హరీష్, సూర్య, సునీల్, సామ్యూల్, మణికంఠ, రవీంద్ర, లావణ్య, నవ్య, గోపాల్, మిత్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్, పిఠాపురం మండల వైస్ ప్రెసిడెంట్ నిమ్మన దుర్గబాబు, జనసేన గ్రామ ప్రెసిడెంట్ నంద్యాల జాన్, గ్రామ నీటి సంఘ ప్రెసిడెంట్ బస్వా నాగసత్తులు, చిత్రాడ విద్యా కమిటీ చైర్మన్ దేశిరెడ్డి సతీష్, తెలుగుదేశం పార్టీ నాయకులు రొంగల శ్రీనివాసరావు, వార్డు ఇంచార్జ్ కోళ్ల శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మొత్తం 36 దూడలు ప్రదర్శించబడ్డాయి. మొదటి, రెండవ, మూడవ బహుమతులు రైతులకు అందజేయబడ్డాయి. ప్రతి రైతుకు ఉపయోగకరమైన సామగ్రి, మినరల్ బ్లాక్స్, పాల క్యాన్లు, బీ-కాంప్లెక్స్ టానిక్ లు పంపిణీ చేయబడ్డాయి. ఈ కార్యక్రమం ద్వారా రైతులలో ఉత్సాహం, పశుసంవర్ధనలో అవగాహన పెరిగినట్లు నివేదికలో పేర్కొనబడింది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.