నాయుడుపేట పోలేరమ్మ ఆలయంలో పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు

తిరుపతి: నాయుడుపేట శ్రీ పోలేరమ్మ దేవస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఈ పూజా కార్యక్రమం నిర్వహించబడింది. పవన్ కళ్యాణ్ ప్రజాసేవలో తిరిగి మరింత ఉత్సాహంతో కొనసాగాలని భక్తిశ్రద్ధలతో పోలేరమ్మ తల్లిని ప్రార్థించారు.

ఈ సందర్భంగా ఉయ్యాల ప్రవీణ్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ప్రజల కోసం నిరంతరం కృషి చేసే నాయకుడని, ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన అవసరం లేదని, పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో త్వరగా కోలుకుంటారని తెలిపారు. ఆయన ఆశయ సాధనకు ఎటువంటి ఆటంకాలు రాకూడదని ఆకాంక్షించారు.

నాయుడుపేట పోలేరమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ నానాబాల సుబ్బారావు, సభ్యులు కృష్ణారెడ్డి, బాలుశెట్టి సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు అట్లా కృష్ణారావు, ఏ.ఎం.సి డైరెక్టర్ గిండి సతీష్, సూళ్లూరుపేట నాయకులు శంకు సురేష్, నాయుడుపేట మండల ఉపాధ్యక్షులు బొల్లకాయల కిరణ్, ఐ.టి కోఆర్డినేటర్ కొప్పల సురేంద్ర, పెళ్లకూరు మండల అధ్యక్షులు మల్లం విజయ్, శోభన్ బాబు, తాతంశెట్టి బాలాజీ, గురునాధం, కుంపటి శ్రీను, సంపతి కోటి, దాసరి మనోజ్, సగ్గం మహేష్, దినేష్, రాజేష్, సుమంత్, శేషద్రి, వీర మహిళ సల్మా తదితరులు పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.