
మంగళగిరి వార్తలు:
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరిలో ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని గౌరవ పాలకొండ శాసనసభ్యులు శ్రీ నిమ్మక జయకృష్ణ గారు మర్యాద పూర్వకంగా కలిసి నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను లేఖల రూపంలో అందజేశారు.
ఈ లేఖల్లో రోడ్ల విస్తరణ, డంపింగ్ యార్డు, లిఫ్ట్ ఇరిగేషన్, నాగావళి ఎడమ కాలువ పనులు, పాలిటెక్నిక్ కాలేజీ, సీతంపేట ఏజెన్సీ రోడ్ల సమస్యలు వంటి అంశాలు ప్రస్తావించబడ్డాయి.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రివర్యులు సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత మంత్రివర్యులతో సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.