
కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా పురపాల శాఖ మంత్రి పొంగూరి నారాయణను ఉమ్మడి తూర్పుగోదావరి సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు కలిశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సహకార కేంద్ర బ్యాంక్‌కు షేర్ క్యాపిటల్ అసిస్టెంట్ ద్వారా ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయాలని కోరారు. రూ.200 కోట్ల వడ్డీ లేని రుణాలు, రూ.44.69 కోట్ల రాయితీ, 6 శాతం వడ్డీ రాయితీ కింద రూ.15.92 కోట్లు, అలాగే 397 మంది లబ్ధిదారులకు టిట్కో అప్పులపై రావాల్సిన రూ.3.34 కోట్ల వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ అంశంపై మంత్రి నారాయణ సానుకూలంగా స్పందించి, విషయాన్ని ముఖ్యమంత్రి మరియు సహకార శాఖ మంత్రికి తెలియజేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి సీఈవో ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు