గొల్లప్రోలు నగర పంచాయతీకి గ్రేడ్-3 మున్సిపాలిటీ హోదా

పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి దిశగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గొల్లప్రోలు నగర పంచాయతీని గ్రేడ్-3 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. ఈ నిర్ణయంతో ప్రాంత అభివృద్ధికి మరిన్ని అవకాశాలు ఏర్పడనున్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఆధ్వర్యంలో అంతర్గత రహదారులు, డ్రైనేజీ, పారిశుధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతం అవుతుంది. గ్రూప్-2 స్థాయి అధికారి మున్సిపల్ కమిషనర్‌గా నియమితులవుతారు. అదనపు సిబ్బంది అందుబాటులోకి రావడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి వీలుకలుగుతుంది. మున్సిపల్ హోదా పెరిగినప్పటికీ ప్రజలపై ఎలాంటి అదనపు భారం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.