జనసేన వీర మహిళా విభాగం ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు!

కరీంనగర్, ముకురాంపురంలోని ప్రభుత్వ పాఠశాలలో జనసేన పార్టీ వీర మహిళ విభాగం ఆధ్వర్యంలో ముందస్తు రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. కరీంనగర్ వీర మహిళ విభాగం జిల్లా నాయకురాలు రాగుల శిరీష ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకుడు కాసరాజు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కాసరాజు మాట్లాడుతూ చిన్నతనం నుంచే పిల్లలకు మన సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. రక్షాబంధన్ పండుగ ద్వారా ప్రతి మహిళను సోదరిగా భావించే ఆత్మీయత, సోదరభావం పెంపొందించాలని, భావితరాలకు మంచి విలువలు, సంప్రదాయాలను అందించాలని సూచించారు.

కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.