పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కువైట్‌లో మెగా రక్తదాన శిబిరం

కువైట్: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని గల్ఫ్ జనసేన–కువైట్ ఆధ్వర్యంలో ఆగస్టు 28, శుక్రవారం రోజున కువైట్‌లోని జాతీయ బ్లడ్ బ్యాంక్ మరియు అదాన్ బ్లడ్ బ్యాంకుల్లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు జనసేన పార్టీ నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా గల్ఫ్ జనసేన–కువైట్ సభ్యులు కంచన శ్రీకాంత్‌తో పాటు జనసైనికులకు అభినందనలు తెలియజేస్తూ, ఈ మహత్తర సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనసేన పార్టీ నాయకుడు శ్రీ నాగబాబు పిలుపునిచ్చారు.

ప్రతి మెగా అభిమాని, పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసైనికులు, వీరమహిళలు, కూటమి శ్రేణులు, సేవాభావం కలిగిన ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

“రక్తదానం – ప్రాణదానం” అనే స్ఫూర్తితో నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.