మెగాస్టార్ జన్మదిన వారోత్సవాల్లో చీరల పంపిణీ

నరసాపురం: మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలను పురస్కరించుకుని నరసాపురం మిస్సమ్మ ఆసుపత్రిలో రెండో రోజు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి చీరలు పంపిణీ చేసి కేక్ కట్ చేశారు.

ఈ కార్యక్రమానికి నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ముఖ్య అతిథిగా హాజరై మెగాస్టార్ చిరంజీవికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయకర్ మాట్లాడుతూ.. చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. చిరంజీవి జన్మించిన ఆసుపత్రిలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ సిరిగినీడి రాజ్యలక్ష్మి, డాక్టర్ మాదంశెట్టి కోటేశ్వరరావు, పోలిశెట్టి శ్రీనివాస్, మైల వసంతరావు, వలవల నాని తదితర నాయకులతో పాటు చిరంజీవి అభిమానులు కోపల్లి శ్రీనివాస్, పోలిశెట్టి సాంబ, చెన్నంశెట్టి నాగు, దివి సత్యన్, తెలగంశెట్టి సూర్యనారాయణ, గుగ్గిలపు శివరామకృష్ణ, మేడిది ప్రభాకర్, పులపర్తి సుబ్బారావు, గన్నాబత్తుల కుమార్, కర్నేని లక్ష్మీనారాయణ, యాతం మహేష్, నల్లి ప్రసాద్, ఎలుబండి సాయి, విస్సా బుజ్జి, జడ్డు సత్తిబాబు, మాట్లా సూర్య, వల్లభరెడ్డి రామకోటి, అడబాల నానినందన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.