జనసేన జెండా ఆవిష్కరణకు టి.సి. వరుణ్‌కు ఆహ్వానం

కళ్యాణదుర్గం : కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలం చిన్నంపల్లి గ్రామంలో ఈ వారంలో ఘనంగా నిర్వహించనున్న జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి జనసేన అనంతపురం జిల్లా అధ్యక్షుడు, అహుడ చైర్మన్ టి.సి. వరుణ్‌ను కళ్యాణదుర్గం జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.

అనంతపురంలో జరిగిన ఈ భేటీలో కార్యక్రమ విశేషాలను నాయకులకు వివరించి, జెండా ఆవిష్కరణతో పాటు నిర్వహించే జనసైనికుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆహ్వానాన్ని స్వీకరించిన టి.సి. వరుణ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

ఈ సందర్భంగా కళ్యాణదుర్గం జనసేన నాయకులు బాల్యం రాజేష్, గంగరాజు, వి.హెచ్. రాయుడు, చిన్నంపల్లి సుమన్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.