
కోటపాలెం పంచాయతీ సుకలలో ఉండకపోవచ్చు.. కానీ కష్టం వచ్చినప్పుడు ముందూ వెనుకా చూడకుండా సహాయం చేయడం జనసేన నైజం అని మరోసారి నిరూపితమైంది.
కోటపాలెంలోని గౌడ కులస్తులకు చెందిన రెండు ఇళ్లు అగ్నికి ఆహుతి కావడంతో పాటు రెండు వంట గదులు కూడా పూర్తిగా కాలిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు, జనసైనికులు వెంటనే స్పందించి బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు.
గొర్లె సూర్య AMC డైరెక్టర్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులను జనసైనికుల సమక్షంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌరి, అప్పన్న, రాజు, వినయ్ మొుత్తారాజు, ఆసిరినాయుడు, రాము, మోహన్, యర్రయ్య, గార, అంజి, గణ తదితర జనసైనికులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని, వారికి అవసరమైన సహాయం అందిస్తామని జనసేన నాయకులు భరోసా ఇచ్చారు.