
అమలాపురం: ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఏపీ యూడబ్ల్యూజే కోనసీమ జిల్లా అధ్యక్షులు ఎం.ఎన్.వి. ప్రసాద్ (బాబీ) ఆధ్వర్యంలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా జర్నలిస్టులు నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించాలని నినాదాలు చేశారు. మీడియా రంగంలో పనిచేస్తున్నవారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అమలాపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొండేపూడి సత్యనారాయణ, ఆచంట వెంకటేశ్వరరావు, డీఎంఏసీ సభ్యులు సుంకర ప్రసాద్, రంకిరెడ్డి కృష్ణ, పిల్లి శేఖర్, నిమ్మకాయల సతీష్, దొమ్మేటి వెంకట్, రంబాల సత్యనారాయణ, మట్టపర్తి రమేష్, ఆసు భరత్ రామ్, కుడుపూడి గణపతి, వాడ్రేవు కృష్ణ చైతన్య, పొట్టుపోతు నాగు, వఫా అబ్బాస్, పి. విజయ్ కుమార్, చొల్లంగి సత్య ప్రసాద్, చింతపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.