
పాయకరావుపేట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఇటీవల అనారోగ్య కారణంగా శస్త్రచికిత్స అనంతరం త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాక్షేత్రంలో తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ ఎస్.రాయవరం మండలంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జనసేన ఎస్.రాయవరం మండల యూత్ అధ్యక్షుడు లింగంపల్లి జ్యోతి కుమార్ ఆధ్వర్యంలో మండల జనసేన నాయకులు, జనసైనికులు కలిసి ఎస్.రాయవరం గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి 108 కొబ్బరికాయలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో వీసం సాయి, తేటకాలి అరవింద్, గొర్లి సతీష్, బొడ్డా నవీన్, అల్లం నరసింగరావు (బాబు), కర్రీ నాని, కొంకుపూడి స్వామి, వీర్ల శేఖర్, కర్రీ శేఖర్, జాగు భాను, అంగినా కోటి తదితర జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా ఆరోగ్యవంతులు కావాలని భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు.