ప్రతిభకు పేదరికం అడ్డు కాదు – దేవిశెట్టి నరసింహారావు

గుంటూరు: సమాజంలో ప్రతిభకు పేదరికం అడ్డు కాదని ప్రముఖ పారిశ్రామికవేత్త దేవిశెట్టి నరసింహారావు పేర్కొన్నారు. ఆదివారం ఎన్టీఆర్ వాకర్స్ అసోసియేషన్ సీసీ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో పేద వైద్య విద్యార్థిని కంచర్ల ప్రవళికకు రూ.20,000 ఆర్థిక సాయం అందించారు.

ఈ సందర్భంగా దేవిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ, ప్రతిభావంతులైన పేద విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించేందుకు సమాజం ముందుకు వచ్చి చేయూతనివ్వాలని కోరారు. ఆర్థిక పరిస్థితులు కలలను అడ్డుకోకూడదని, సహాయం అందితే ప్రతిభ వెలుగులోకి వస్తుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో పంచుమర్తి కోటేశ్వరరావు, పురుషోత్తం, కైలాష్, గుప్తా, నాగమల్లేశ్వరరావు, తిరుమల వాసు, ధూపగుంట్ల మల్లికార్జున, కలర్ శేఖర్, మంచి కంటి వెంకట్ (సీసీ), ఆర్.వి. సత్యనారాయణ, ఉపాధ్యాయ నాయకుడు బెల్లంకొండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.