జనసైనికుడు ఆలపాటి రాజేష్‌కు ఘన నివాళులు… అవయవ దానం ద్వారా మరెంతో మందికి జీవం

మొగల్తూరు మండలానికి చెందిన జనసైనికుడు ఆలపాటి రాజేష్ మృతి పట్ల తీవ్ర విషాదం నెలకొంది. మంగళగిరిలోని NRI హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. మొగల్తూరు బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజేష్, చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరం.

రాజేష్ భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చిన సందర్భంగా నేతలు, కార్యకర్తలు వెళ్లి ఘనంగా అశ్రునివాళులు అర్పించారు. 2019 సంవత్సరం నుండి జనసేన పార్టీ పట్ల అపారమైన నిబద్ధతతో పనిచేసిన రాజేష్, రెండు ఎన్నికల్లోనూ మొగల్తూరులో బూత్ ఏజెంట్‌గా సేవలందించారు.

ఆయన పార్టీ పట్ల చూపిన అంకితభావం, కృషిని అందరూ స్మరించుకున్నారు.

ఇక రాజేష్ కుటుంబ సభ్యులు తీసుకున్న అవయవ దానం నిర్ణయం మరింత గొప్పది. ఈ నిర్ణయం ద్వారా మరెంతో మందికి ప్రాణదానం చేసినట్లు నాయకులు కొనియాడారు.

రాజేష్ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన సేవలు, త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం కలగాలని ప్రార్థించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.