
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స అనంతరం త్వరగా కోలుకుని మళ్లీ ప్రజల్లో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షిస్తూ పాండూరు ఆంజనేయస్వామి ఆలయంలో జనసేన పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని వరదయ్యపాలెం మండల జనసేన అధ్యక్షుడు చిరంజీవి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉపాధ్యక్షుడు తులసి రామ్, కార్యదర్శి పరుశురాం, నాయకులు చెంగయ్య, భగీ రాజ్ తదితరులు పాల్గొన్నారు. భక్తి భావంతో పూజలు నిర్వహించి టెంకాయలు కొట్టి ప్రార్థనలు చేశారు.
పవన్ కళ్యాణ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని మళ్లీ ప్రజాసేవలో పాల్గొనాలని, ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని నాయకులు మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.