
భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలను, సంతోషాన్ని అందించాలి
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఎక్స్ లో పోస్టు చేశారు. ముఖ్యమంత్రిగా సుదీర్ఘ పాలన అనుభవం కలిగిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు తన విజన్ తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బృహత్తర బాధ్యతను తీసుకున్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అనే లక్ష్యాలను నిర్దేశించుకొన్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు చిరునామాగా తీర్చిదిద్దటం ద్వారా యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపరుస్తున్నారు. మంచి ప్రభుత్వం అనే నినాదాన్ని నిజం చేసేలా సాగుతున్న శ్రీ చంద్రబాబు గారి పాలనలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్ర స్థానంలో నిలుస్తుంది. శ్రీ చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను… సంతోషాన్ని అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.