చట్ట సభల్లో మహిళా శక్తిని పెంపొందించే సదవకాశాన్ని దూరం చేశారు

చట్ట సభల్లో మహిళా శక్తిని పెంపొందించే సదవకాశాన్ని ప్రతిపక్ష పార్టీలు దూరం చేశాయని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు కూడా ఆమోదించి ఉంటే వారికీ గౌరవం దక్కేది. రానున్న రోజుల్లోనైనా మహిళా శక్తికి చట్ట సభల్లో సముచిత స్థానం దక్కుతుంది. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ బిల్లును లోక్ సభ ముందుకు తీసుకువచ్చిన ప్రక్రియను ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా జనసేన పార్టీ స్వాగతిస్తుంది. ఈ బిల్లు ఆమోదం పొంది ఉంటే యావత్ భారత మహిళలు ఎంతో సంతోషించి ఉండేవారని శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.