ప్రతిభకు జనసేన ప్రశంసలు – మదనపల్లిలో విద్యార్థినికి సన్మానం

మదనపల్లిలో జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త కాలం చలపతి రాయల్ కుమార్తె కాలం కీర్తన రాయల్ సాధించిన ప్రతిభను గుర్తిస్తూ పార్టీ నాయకులు సన్మానించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 470 మార్కులకు గాను 464 మార్కులు సాధించి కాలేజీలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషంగా నిలిచింది.

ఈ సందర్భంగా జనసేన రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ దారం అనిత, రాష్ట్ర సీనియర్ నాయకులు రాయల్ గణి, దారం హరి ప్రసాద్, చలపతి పాల్గొని కీర్తనను అభినందించారు.

కీర్తన తల్లిదండ్రులు శారీరక వికలాంగులు అయినప్పటికీ, ఆర్థిక ఇబ్బందులను అధిగమించి తమ కుమార్తెకు ఉన్నత విద్య అందించాలనే పట్టుదలతో ముందుకు నడిపించడం అభినందనీయమని నాయకులు తెలిపారు.

ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులను సమాజం ప్రోత్సహించాలని, వారి విజయాలు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.