టైమ్ 100 జాబితా 2026: భారతీయుల ప్రతిభకు ప్రపంచ గుర్తింపు

టైం మ్యాగజైన్ విడుదల చేసిన 2026 సంవత్సరపు ‘ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావశీలులు’ జాబితాలో భారతీయులు విశేషంగా రాణించారు. టెక్నాలజీ, సినిమా, ఆహార రంగాలకు చెందిన ప్రముఖులు ఈ జాబితాలో స్థానం సంపాదించడం విశేషం.

భారత్ నుంచి సుందర్ పిచాయ్, రణ్‌బీర్ కపూర్, వికాస్ ఖన్నా ఈ గౌరవాన్ని అందుకున్నారు.

సినిమా విభాగంలో రణ్‌బీర్ కపూర్ నటనలోని లోతు, భావోద్వేగాలను వ్యక్తపరిచే ప్రత్యేక శైలి ప్రశంసలు అందుకుంది. అతడిని కేవలం స్టార్‌గా కాకుండా భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే కథకుడిగా అభివర్ణించారు.

టెక్నాలజీ విభాగంలో ‘టైటాన్స్’ కేటగిరీలో చోటు దక్కించుకున్న సుందర్ పిచాయ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో నాయకత్వం వహిస్తూ గూగుల్ ఉత్పత్తుల్లో ఏఐ వినియోగాన్ని విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు.

అదే విధంగా చెఫ్ వికాస్ ఖన్నా, వంటకాలను సాంస్కృతిక వారధిగా ఉపయోగిస్తూ భారతీయ సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు గుర్తింపు పొందారు.

ఇతర ప్రముఖులలో డొనాల్డ్ ట్రంప్, షీ జిన్‌పింగ్, బెంజమిన్ నెతన్యాహు తదితరులు చోటు దక్కించుకున్నారు. ప్రపంచ రాజకీయాలు, సంస్కృతి, సాంకేతికతపై ప్రభావం చూపుతున్న వ్యక్తులను ఈ జాబితా ద్వారా టైమ్ గుర్తించింది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.