
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి డి.జి.పి.గా బాధ్యతలు నిర్వర్తించిన శ్రీ హెచ్.జె.దొర గారు కన్నుమూశారని తెలిసి చింతించానంటూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. శాంతిభద్రతల నిర్వహణలో తనదైన ముద్రను వేశారు. సమర్థమైన పోలీసింగ్ ద్వారా హింసను అరికట్టేందుకు కృషి చేశారు. కమ్యునిటీ పోలీసింగ్ ప్రోగ్రాంపై ప్రత్యేక దృష్టి సారించారు. శ్రీ హెచ్.జె. దొర గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.