
పూతలపట్టు నియోజకవర్గ జనసేన నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురాం చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసే కార్యక్రమంలో ఆయనను జనసేన పార్టీలో చేరమని ఆహ్వానించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య మాట్లాడుతూ.. రఘురాం చౌదరి పార్టీకి చేరితే నియోజకవర్గ అభివృద్ధికి మరింత బలం చేకూరుతుందని పేర్కొన్నారు. దీనికి స్పందించిన రఘురాం చౌదరి, జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు పవన్ కళ్యాణ్ ఆలోచన విధానానికి ఆకర్షితులయ్యామని, పార్టీలో చేరడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీఉమ్మడి చిత్తూరు జిల్లా సంయుక్త కార్యదర్శి నెహ్రూ రాయల్. యాదమౌరి మండల అధ్యక్షుడు కుమార్, మండల ఉపాధ్యక్షుడు డిల్లీ సుల్తాన్, పీఏసీ డైరెక్టర్ ప్రభాకర్, తౌనంపల్లి మండల ప్రధాన కార్యదర్శి ఉదయ్, అజీత్, చిన్న, యువరాజ్, శ్రీ తేజ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హరితేజ, ఇరాల మండల జనసేన పార్టీ అధ్యక్షుడు కే. పురుషోత్తం, ఉపాధ్యక్షుడు నవీన్, జిల్లా సీనియర్ నాయకులు మహేష్ సయ్యిరో, ఆవుల శాంతమూర్తి, బంగారుపాలెం జనసేన పార్టీ యువ నాయకులు కిషోర్, బంగారుపాలెం మండల ప్రధాన కార్యదర్శులు పవన్, అనిల్ మరియు పూతలపట్టు నియోజకవర్గంలోని వివిధ మండలాల జనసైనికులు పాల్గొన్నారు.