
జనసేన పార్టీకి యువతే శక్తి, వీర మహిళలే ఆత్మ అని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు.
విశాఖపట్నంలో జరిగిన జనసేన పార్టీ లెజిస్లేటివ్ పార్టీ, కార్యవర్గ సమావేశాల అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.
ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ –
“రాష్ట్ర క్షేమం, దేశం ఉన్నతి కోసం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ దూరదృష్టితో ఆలోచిస్తారు. కూటమి ఏర్పాటు కూడా ఆయన ఉన్నత ఆలోచనల ఫలితం. వైసీపీ ఐదేళ్ల చీకట్లో మగ్గిపోయిన రాష్ట్రాన్ని తిరిగి వెలుగులోకి తేవడం కూటమి ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగా జనసేన తన వంతు కృషి చేస్తుంది. ప్రజా సమస్యలు, రాష్ట్ర అంశాలపై మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు అధినేత పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. జనసేన విధానం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం సుస్థిరమైన పాలన.” అని పేర్కొన్నారు.
???? స్టీల్ ప్లాంట్, సుగాలి ప్రీతి కేసుపై పవన్ కళ్యాణ్ పోరాటం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో పవన్ కళ్యాణ్ గారి నిజాయితీని విజయ్ కుమార్ గుర్తుచేశారు.
“అధికారంలో లేకపోయినా ఢిల్లీ వెళ్లి అమిత్ షా గారిని కలసి ప్రైవేటీకరణ వద్దని చెప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారే. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా ఎన్డీఏ సమావేశాల్లో స్టీల్ ప్లాంట్ గురించి బలంగా మాట్లాడారు. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలి.” అని అన్నారు.
అలాగే సుగాలి ప్రీతి కేసు విషయాన్ని ప్రస్తావిస్తూ –
“మొదటి నుండి నిబద్ధతతో పోరాడింది జనసేనే. లక్షలాదిమందితో కర్నూలులో పవన్ కళ్యాణ్ గారు చేసిన కవాతు తర్వాత ఒత్తిడికి గురై వైసీపీ ప్రభుత్వం పరిహారం ఇచ్చింది. కానీ అప్పటి పాలకులు సాక్షాలను ధ్వంసం చేశారు. ఈ కేసులో బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు జనసేన పోరాటం కొనసాగుతుంది.” అని స్పష్టం చేశారు.
???? సోషల్ మీడియా దుష్ప్రచారం పై చర్చ
సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న విపరీత దుష్ప్రచారం గురించి సమావేశంలో చర్చించామని, అసెంబ్లీలో కూడా దీనిపై బలంగా నిలబడతామని విజయ్ కుమార్ తెలిపారు.
???? కార్యకర్తలకు న్యాయం
“జనసేన పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరగాలి అని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఆలోచిస్తున్నారు. పార్టీ విస్తరణకు ప్రత్యేక ప్రణాళికను కూడా రూపొందిస్తున్నారు.” అని ఆయన అన్నారు.
సమావేశంలో శాసనమండలి ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, శాసనసభ ప్రభుత్వ విప్స్ బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, అరవ శ్రీధర్, ఎమ్మెల్యేలు పత్సమట్ల ధర్మరాజు, పంతం నానాజీ తదితరులు పాల్గొన్నారు.