శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం, సీతవలస గ్రామంలో త్రాగునీటి సమస్య ఎక్కువ ఉంది అని ఆ గ్రామ జనసేన నాయకులు ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకులు డా.విశ్వక్సేన్ కి తెలియజేయడం జరిగింది. ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకులు డా.విశ్వక్సేన్ ఆదివారం వెళ్లి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంలో ఆ గ్రామ మహిళలు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ నాయకులు శుభ్రమైన మంచి త్రాగునీరు సదుపాయం కూడా కల్పించలేకపోతున్నారు, వాటర్ ట్యాంక్ కూడా కొన్ని రోజుల క్రితం పగిలింది కానీ ఎవరు పట్టించుకోనే నాధుడే లేరు, అని బాధపడుతూ, ఆ గ్రామ ప్రజలకు ఈ త్రాగు నీరు బాగోలేక సుమారు 5 మందికి డయాలసిస్ ప్రాబ్లం ఉంది అని విశ్వక్సేన్కి తెలియజేశారు. ఈ సందర్భంగా విశ్వక్సేన్ మాట్లాడుతూ 4 రోజుల్లో ఈ పగిలిపోయిన వాటర్ ట్యాంక్ మార్చకపోతే జనసేన పార్టీ నుంచి కొత్త ట్యాంక్ వేయిస్తాము. త్రాగునీరు అందిస్తాము అని మాట ఇవ్వటం జరిగింది. ఈ కార్య క్రమంలో రణస్థలం మండల అధ్యక్షులు బస్వ గోవింద్ రెడ్డి, వడ్డాది శ్రీనివాసరావు, గొర్లె సూర్య , అప్పలకొండ, లావేరు మండల అధ్యక్షులు బార్నాల దుర్గారావు, లక్ష్మనాయుడు, కాకర్ల బాబాజీ, అప్పన్న , నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.