
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు విజయవాడలోని లోక్ భవన్‌లో మర్యాదపూర్వకంగా తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జె కె మహేశ్వరి, జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ, జస్టిస్ పి.కె.మిశ్రా, జస్టిస్ ఎస్ వి ఎన్ భట్టి, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి , గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు హాజరయ్యారు.