
రాజోలు నియోజకవర్గం: ఫిబ్రవరి 26వ తారీఖు నుండి జనసేన సభ్యత్వ నమోదు మొదలుకానున్న నేపధ్యంలో జనసేన సభ్యత్వ నమోదు సన్నహక సమావేశం శాసన సభ్యుల వారి క్యాంపు కార్యాలయం నందు జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత సంవత్సరన్నార కాలంగా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని మనం చేసిన అభివృద్ధిని చూపించి సభ్యత్వాలు నమోదు చేయాలని పిలుపునిచ్చారు.
గతంలో 22 వేలు పైగా సభ్యత్వాలు నమోదు చేశాం అని ఈ సారి 30 వేలకు పైగా నమోదు చేయాలని నాయకులకు సూచించారు. నియోజవర్గంలో వందమంది సాధక్ లు సభ్యత్వ నమోదు చేసే విధంగా మండల అధ్యక్షులు, జనసేన నాయకులు కృషి చేయాలని అన్నారు.
ఇందులో భాగంగా పార్టీ కోసం పనిచేసే వారిని “ఉద్యమి, సాధక్, ప్రదాత” లుగా వర్గీకరించారని తెలిపారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తమ తమ అభిప్రాయాల్ని తెలియజేశారు.
క్యాంపు కార్యాలయం నందు జరిగిన ఈ సన్నాహక సమావేశంలో జనసేన నాయకులు, మండలాధ్యక్షులు, గ్రామశాఖాధ్యక్షులు, వీర మహిళలు, కార్యకర్తలు, సాధాక్ లు పాల్గొన్నారు.