రక్తదానం మహాదానం – సేవలో ముందున్న జనసేన నాయకులు

పాలకొండ నియోజకవర్గం: జేమ్స్ హాస్పిటల్‌ నందు ఓ రోగికి అత్యవసరంగా రక్తం అవసరమైన నేపథ్యంలో, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి జనసేన జానీ స్పందించారు.

వీరఘట్టం మండలం తెట్టింగి గ్రామానికి చెందిన జనసేన నాయకులు పొట్నూర్ పి.జె. మోహన్, మనోజ్‌లతో కలిసి ఆసుపత్రికి చేరుకుని రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా జనసేన జానీ మాట్లాడుతూ.. ఇది తన 18వ రక్తదానం అని తెలిపారు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి సేవా స్పూర్తి తనకు ప్రేరణగా నిలిచిందని పేర్కొన్నారు.

అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భావజాలానికి అనుగుణంగా మానవ సేవే మహాదానం అనే సిద్ధాంతంతో ఈ రక్తదానం కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. యువత ఆరోగ్యంగా ఉండి అవసరమైన వారికి సహాయం చేయాలని పిలుపునిచ్చారు.

పాలకొండ నియోజకవర్గం సీనియర్ జనసేన నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని అభినందించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.