
నెల్లూరులో నిర్వహించిన “ప్రతి గడపకి జనసేన” కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. స్థానికులు మాట్లాడుతూ.. “చచ్చేదాకా మా ఫ్యామిలీ మద్దతు పవన్ కళ్యాణ్‌కే… విలాసాలు త్యజించి ప్రజాసేవలో ఉన్న నాయకుడు” అంటూ తమ మద్దతు ప్రకటించారు.
అడవుల్లో స్కూల్ పిల్లలు రోడ్లు అడిగితే 15 గంటల్లోపే స్పందించే నాయకత్వం ఇదే అని కొనియాడారు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందినట్లు, అలాగే నారాయణ నుంచి ఆర్థిక సహాయం అందిందని చెబుతూ, సేవా కార్యక్రమాలపై కృతజ్ఞత వ్యక్తం చేశారు. మళ్లీ గెలుపు ఖాయం అని స్థానికులు విశ్వాసం వ్యక్తం చేశారు.
జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల, నెల్లూరు ఏఎంసీ డైరెక్టర్ మరియు జనసేన వీర మహిళ విజయలక్ష్మి గునుకుల ఆధ్వర్యంలో గుర్రాలమడుగు సంగం 16వ డివిజన్‌లో ఈ కార్యక్రమం జరిగింది.
ఇంటిింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ, కూటమి ఆశయాలను వివరించారు. స్థానిక సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. త్వరలోనే నెల్లూరు సిటీలోని 28వ డివిజన్‌లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలు స్థానిక నాయకులు, వీర మహిళలు, తెలుగుదేశం నాయకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వానికి మద్దతుగా ప్రజలు ఉత్సాహం వ్యక్తం చేశారు.