ప్రజలతో మమేకమై జనసేన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదును ముందుకు తీసుకెళ్లండి

• ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు… పార్టీ సభ్యత్వ నమోదును ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్లాలి
• సమష్టిగా సమయాన్ని వినియోగించుకుందాం
• పార్లమెంటు నియోజకవర్గాలకు సమన్వయకర్తల నియామకం
• జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ప్రణాళికపై టెలీ కాన్ఫరెన్సు నిర్వహించిన మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ 
‘జనసేన పార్టీ సభ్యత్వ నమోదు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఉన్నత ఆలోచనలు, మహోన్నత ఆశయాలతో నిండిన యజ్ఞం. పార్టీ సిద్దాంతాలు, భావజాలం నమ్మిన ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళ సభ్వత్వ నమోదును మనసు నిండా భావోద్వేగంతో చేస్తారు. మనమంతా బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు సూచించారు. సభ్వత్వ నమోదును అత్యంత పకడ్బందీగా నిర్వహించాలన్నారు. భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం, వచ్చే స్థానిక సంస్థల్లో పార్టీకి బలాన్ని సమీకరించేలా ఈ బాధ్యతను నిర్వర్తించాలన్నారు. ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం సమన్వయం కోసం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియమించారని తెలిపారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న సందర్భంగా కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై సమన్వయకర్తలతో శనివారం మధ్యాహ్నం శ్రీ మనోహర్ గారు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ‘‘పార్టీ సభ్యత్వ నమోదు మీద ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దృష్టి నిలపాలి. శాసనసభ, మండలి సమావేశాలు ఉన్నందున, సమావేశాలకు హాజరవుతూనే, మిగిలిన సమయాన్ని పూర్తిగా పార్టీకి కేటాయించాలి. సభ్యత్వ నమోదు కార్యక్రమం మీద క్షేత్రస్థాయి నుంచి పక్కా ప్రణాళికను రూపొందించుకొని ముందుకు వెళ్లాలి. క్షేత్రస్థాయి నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ, స్థానికంగా దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేలా చొరవ తీసుకుంటే బాగుంటుంది. దీనివల్ల పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఈ వారాంతంతో లెక్క పెడితే మరో మూడు వారాంతాలు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కిందకు వస్తాయి. ప్రతి వారం కూడా నాయకులు సమావేశాలను ఏర్పాటు చేసుకొని, ఎన్ని సభ్యత్వాలు పూర్తి అయ్యాయి..? ఇంకా ఎంత మేర చేయవచ్చు అనే విషయాలను చర్చించుకోవాలి. సమీక్షించుకోవాలి.
• స్పష్టమైన నివేదిక తయారు చేసుకోండి
క్షేత్రస్థాయికి వెళ్లి పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేయించడం రాజకీయ కార్యక్రమంగా భావించాలి. పార్టీకి సానుకూలతలు, ప్రతికూలతలపై క్షేత్రస్థాయి వివరాలను నమోదు చేసుకోండి. ప్రతి ఒక్కరినీ కలుస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకోండి. గమనించిన ప్రతి అంశాన్ని నివేదిక రూపంలో సిద్ధం చేస్తే భవిష్యత్తు కార్యక్రమాలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు ఎంతగానో తోడ్పడుతుంది. ఎక్కడా సమన్వయ లోపం రాకుండా బాధ్యతగా సభ్యత్వ నమోదును చేసేలా బాధ్యతలు తీసుకోండి. ఏ సాంకేతిక సమస్య వచ్చినా మన ఐటీ టీం దాన్ని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంటుంది. అలాగే ఇతర సమస్యలు ఏమైనా ఉంటే పార్టీ కేంద్ర కార్యాలయంలో ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కో ఆర్డినేషన్ బృందాన్ని ఏర్పాటు చేశాము. ఈ వారం నుంచి ప్రత్యేక సమావేశాలు అన్ని నియోజకవర్గాల్లో సన్నద్ధత సమావేశాలు నిర్వహించాలి’’ అన్నారు.
• కొత్త సభ్యుల చేరిక పార్టీకి బలం అవుతుంది : శ్రీ పిడుగు హరిప్రసాద్, ప్రభుత్వ విప్, పార్టీ అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి
ఈ సందర్భంగా శాసనమండలి ప్రభుత్వ విప్, పార్టీ అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు మాట్లాడుతూ… ‘‘పార్టీ సభ్యత్వ నమోదు రెన్యూవల్స్ తోపాటు కొత్త సభ్యులను చేర్చడం అనేది కీలకం. ముఖ్యంగా జెన్ జీ తరాన్ని పార్టీకి దగ్గర చేయాలి. భవిష్యత్తు రాజకీయాలకు అది మరింత ఉపయోగంగా ఉంటుంది. కొత్త సభ్యుల చేరిక పార్టీకి బలం చేకూరుస్తుంది. గతంలో ప్రతి నియోజకవర్గం నుంచి పార్టీ నియమించిన ఇంఛార్జిలకు మాత్రమే బాధ్యతలు ఉండేవి. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నియోజకవర్గాల్లో ఉన్న కీలకమైన ఇతర నాయకులను సభ్యత్వ నమోదులో భాగస్వామ్యం చేసేలా నిర్ణయం తీసుకున్నారు. సీనియర్లు కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. సభ్యత్వం స్వీకరించే ఉద్యమిలను చేర్చే సాధక్ లను ప్రతి నియోకవర్గం నుంచి 75 మంది నుంచి 100 మంది వరకు ఎంపిక చేయాలని భావిస్తున్నాం. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ఏటా భారీగా పెరుగుతూ వెళ్తోంది. ఇది పార్టీ బలాన్ని చాటి చెబుతోంది. ఈ ఏడాది మొదటిసారి ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉండి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తున్నాం. చివరిసారి 12.6 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈసారి రెట్టింపు కంటే అధికంగా పార్టీకి కొత్త సభ్యులను చేర్చాలి. అవకాశం ఉన్న చోట కొత్త లక్ష్యాలతో సభ్యత్వ నమోదును విస్తృతం చేయాలి. ఇది మనందరి సమష్టి బాధ్యత అని భావిద్దాం’’ అన్నారు.

25 పార్లమెంటు నియోజకవర్గాలవారీగా పార్టీ సభ్యత్వ నమోదు సమన్వయకర్తలు వీరే…
శ్రీకాకుళం: శ్రీ కొరికాన రవి కుమార్
విజయనగరం: శ్రీమతి లోకం నాగ మాధవి
విశాఖపట్నం: శ్రీ సిహెచ్. వంశీకృష్ణ శ్రీనివాస్
అనకాపల్లి: శ్రీ పంచకర్ల రమేశ్ బాబు
అరకు: శ్రీ సుందరపు విజయ్ కుమార్
కాకినాడ: శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్
అమలాపురం: శ్రీ బత్తుల బలరామకృష్ణ
రాజమండ్రి: శ్రీ కందుల దుర్గేష్
నరసాపురం: శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు
ఏలూరు: శ్రీ గిడ్డి సత్యనారాయణ
విజయవాడ: శ్రీ బొమ్మిడి నాయకర్
మచిలీపట్నం: శ్రీ వల్లభనేని బాలశౌరి
గుంటూరు: శ్రీ పిడుగు హరిప్రసాద్
నరసరావుపేట: శ్రీ పంతం నానాజీ
బాపట్ల: శ్రీ పత్సమట్ల ధర్మరాజు
ఒంగోలు: శ్రీ కొణతాల రామకృష్ణ
నెల్లూరు: శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్
కడప: శ్రీ టి.సి.వరుణ్
రాజంపేట: శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు (కె.కె.)
కర్నూలు: శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి
నంద్యాల: శ్రీ కిలారు రోశయ్య
అనంతపురం: డా.పి.హరిప్రసాద్
హిందుపూర్: శ్రీ ఎస్.కె.రియాజ్
చిత్తూరు: శ్రీ వేగుళ్ల లీలాకృష్ణ
తిరుపతి: శ్రీ ఆరణి శ్రీనివాసులు
* కేంద్ర కార్యాలయంలో సభ్యత్వ నమోదు సమన్వయకర్తలు
– శ్రీ చందు సాంబశివరావు
– శ్రీ గంజి చిరంజీవి
– డా. కె.శరత్ కుమార్

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.