• నో సీట్ టూ వన్ సీట్, వన్ సీట్ టూ 100% స్ట్రైక్ రేట్ తో విజయం సాధించాం
• జాతీయ వాదం కలిగిన ప్రాంతీయ పార్టీ జనసేన
• పార్టీ నడపడానికి వేల కోట్లు కాదు బలమైన భావజాలం కావాలి
• జనసేన పోరాటం వల్లే సుగాలి ప్రీతి కుటుం బానికి పరిహారం అందింది
• అప్పటి వైసీపీ ప్రభుత్వం కేసు సీబీఐకి అప్పగిం చినట్లు నాటకం ఆడింది
• స్టీల్ ప్లాం ట్ ప్రైవేటీకరణ నిలుపుదలకు జనసేన పార్టీ మొదటి నుంచి పోరాటం చేసింది
• వైసీపీ నాయకుడు కనీసం అఖిల పక్షం వేయమని సూచిం చినా స్పం దించలేదు
• విశాఖపట్నం లో జరిగిన పార్టీ కార్యనిర్వా హకవర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్

“నో సీట్ నుండి వన్ సీట్, వన్ సీట్ నుండి 100% స్ట్రైక్ రేట్ — జనసేన కొత్త చరిత్ర రాసింది.
జనసేన ఒక ప్రాంతీయ పార్టీ అయినా, బలమైన జాతీయవాద సిద్ధాంతం కలిగిన పార్టీ.
పదవుల కోసం కాదు, ప్రజల కోసం పోరాటమే జనసేన అసలు స్వరూపం.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవడం నుండి సుగాలి ప్రీతి కేసులో న్యాయం కోరడం వరకు —
జనసేన పోరాటాలకు స్ఫూర్తి.
ప్రజలు ఆశించిన మార్పు కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది.
నాయకుడు ఎప్పుడూ కార్యకర్తల ఇంటి వద్ద ఉండాలి, వారి సమస్యలు వినాలి.
అదే మా మార్గం, అదే మా బలం.”
???? పవన్ కళ్యాణ్ ముఖ్య వ్యాఖ్యలు
- పదవులు కాదు – పోరాటమే ముఖ్యం: నా రాజకీయ జీవితంలో 15 ఏళ్ళు ఎలాంటి పదవి లేకుండా పోరాడాను. పదవుల వ్యామోహం మరిచిపోవాలి. పార్టీకి సైద్ధాంతిక బలం నేనే ఇస్తాను.
- సుగాలి ప్రీతి కేసు: తల్లి ఆవేదనతో కర్నూలుకు వెళ్లి పోరాడాం. ఆ ఒత్తిడి వల్లే కేసు సీబీఐకి వెళ్లింది. కానీ సాక్ష్యాలు తారుమారు చేశారు. నేను మాత్రం న్యాయం జరిగేవరకు పోరాడుతాను. ఇది ఒక్క కేసు కాదు, బాలికల భద్రతకు సంబంధించిన అంశం.
- విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్: ఆంధ్రుల హక్కు. గత ప్రభుత్వం 151 సీట్లు ఉన్నా అడ్డుకోలేకపోయింది. నేను ఢిల్లీ వెళ్లి అమిత్ షా గారికి వినతిపత్రం ఇచ్చాను. మన ప్రయత్నంతో ప్రైవేటీకరణ ఆగింది. తర్వాత రూ.14 వేల కోట్లు సాయం కూడా వచ్చింది.
- కార్యకర్తల ఇళ్లలో బస: అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కార్యకర్తల దగ్గరగా ఉండటం నా ధ్యేయం. కార్యకర్తల ఇళ్లలో బస చేసి వారి సమస్యలు తెలుసుకుంటాను. ఆర్‌ఎస్‌ఎస్ తరహా నిబద్ధత మనకు స్ఫూర్తి.
- కూటమి స్పూర్తి: ప్రజలు 164 స్థానాలతో భారీ విజయాన్ని ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమి అవసరం. మన పని మనం చేసుకుంటూ వెళితే ఎటువంటి సమస్య లేదు.
జనసేన అంటే పోరాటాలకు స్ఫూర్తి, ప్రజల కోసం కట్టుబాటు, కార్యకర్తల కోసం అంకితభావం.
పదవుల కోసం కాదు – ప్రజల కోసం నిజమైన రాజకీయమే మా లక్ష్యం.
