
చండ్రగూడెం: మైలవరం ఏఎంసీ చైర్మన్ పొనకళ్ళ నవ్యశ్రీ మరియు జనసేన పార్టీ మైలవరం మండల అధ్యక్షుడు శీలం బ్రహ్మయ్య ఆధ్వర్యంలో, బెస్ట్ హాస్పిటల్ సౌజన్యంతో ఆదివారం క్రొత్త చండ్రగూడెం ఎంపీపీ స్కూల్‌లో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మైలవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ అక్కల రామ్మోహన్రావు (గాంధీ) హాజరయ్యారు. ఏఎంసీ చైర్మన్ పొనకళ్ళ నవ్యశ్రీ రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ మెడికల్ క్యాంప్‌లో రూ. 2500 విలువ గల ఎముకల సాంద్రత పరీక్షతో పాటు ఇతర వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి, మందులు కూడా ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బొలియాశెట్టి శ్రీకాంత్, కొండపల్లి మున్సిపాలిటీ కో-ఆప్షన్ మెంబర్ ఎర్రం శెట్టి నాని, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు ఏ. శివరాం ప్రసాద్, పిఎసిఎస్ డైరెక్టర్ ప్రత్తి తిరుపతిరావు, డాక్టర్ తేజ, డాక్టర్ నవీన్, డాక్టర్ పూజిత, డాక్టర్ మధు, బెస్ట్ హాస్పిటల్స్ సిబ్బంది, అలాగే జనసేన నాయకులు కూసుమంచి కిరణ్ కుమార్, గజరావు శ్రీనివాసరావు, జి.వి. రవితేజ, వీర్ల పౌల్ రాజ్, శీలం కృష్ణమూర్తి, షేక్ బడే హజరత్, తోమ్మండ్రు నవీన్, మత్తి హరికృష్ణ, దాసరి వెంకట శశి కుమార్, మర్రి కొండలరావు, కడియం బాలరాజు, శీలం చందు, కడియం విజయ్ తదితరులు పాల్గొన్నారు.
జనసైనికులు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.