కాకినాడ రూరల్ నియోజకవర్గం : కాకినాడ రూరల్, వలసపాకలలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కాకినాడ ప్రధమ మేయర్ శ్రీమతి పోలసపల్లి సరోజ, కాకినాడ రూరల్ నియోజకవర్గ నాయకులు శ్రీ సలాది శ్రీనివాసు బాబు, తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు శ్రీమతి & పిల్లి అనంతలక్ష్మిసత్యనారాయణ మూర్తి , తెలుగుదేశం పార్టీ పరిశీలకులు కుడుపూడి సత్తి బాబులు 16వ రోజు ఇంటింటికి పర్యటన చేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గ ప్రజలు ప్రభుత్వం మారాలి ఈ పరిపాలన మారాలి . వీధుల్లో కనీసం లైట్లు వెలగవు పట్టించుకునే వారుండరు అని వాపోయారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులకు చేసిందంటూ ఏమి లేదు, వారి ఉద్యోగ కాలపరిమితి అయిపోయాక హాయిగా ఉండాల్సిన విశ్రాంతి ఉద్యోగులు పెన్షన్లు రాక ఇబ్బందులు పడుతున్నా మని విసుగుచెంది తీవ్ర మండిపాటును వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమాల కొలువైన ఈ ప్రభుత్వాన్ ని గద్దె దించే దిశగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాబోయే జనసేన-తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయంజరుగుతుం దనీ, ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు సత్వరమే అందుతాయని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకు లు, జనసైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.