కాకినాడ సిటి : జనసేన పార్టీ నాయకులు పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలమేరకు 44వ డివిజన్ మెహర్ నగర్ ప్రాంతంలో రావిపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం దివ్యాంగుల కోఆర్ డినేటర్ శ్రీమన్నా రాయణ పర్యవేక్షణలో దివ్యాంగుల భరోసా యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ యాత్రలో భాగంగా జనసేన పార్టీ శ్రేణులు దివ్యాంగులు కొండేపూడి సత్యన్నారాయణ, దల్లే అప్పా యమ్మ లను కలి సి వారితో వారి సమస్యలపై మా ట్లాడి వారు ఎదుర్కొంటు న్న సమస్యలపై చర్చించారు. సమాజంలో దివ్యాంగులు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నా రనీ వారి జీవితానికి భద్రత లేదని ఆందోళన చెందుతున్నారన్నారు. నేటి పోటీ ప్రపంచంలో మిగిలిన వారితో సమానంగా పోటీ పడాలంటే అందుకు తగిన సహాయ సహకారాలు ప్రభుత్వం కల్పించాలనీ , కానీ దురదృష్టం కొద్దీ నేటి వై.సి.పి ప్రభుత్వంలో ఎవరూ పట్టించుకోడంలేదని వాపోతున్నారు. కరెంటు రీడింగు నిర్దేశించిన యూనిట్లు కన్నా ఎక్కువ ఉన్నాయని, లేక వేరే కారణంతోనో పెన్షన్ నిరాకరిస్తే ఇక దివ్యాంగుల మానసికస్థైర్యం ఎలా పెరుగుత ుందని నిలదీసారు. జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ప్రభుత్వంలో దీనిపై తగిన నిర్ణయం తీసుకోడం జరుగుత ుందని ప్రజల మద్దతు అందుకు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తోరం చిరంజీవి, తుమ్మలపల్లి సీతారాం , డోలంకి మురళీక్రిష్ణ, గరగ శ్రీనివసరావు, నున్నా సత్యన్నా రాయణ(బాబీ), యర్రంశెట్టి జగదీశ్, చోడపనీడి రామసతీశ్ తదితరులు పాల్గొన్నారు.