ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో సమస్యలు పరిష్కరిస్తాం : వినుత కోటా

శ్రీకాళహస్తి , 2 వ రోజు “జనసేన విజయ యాత్ర – ఏపి నీడ్స్ పవన్ కళ్యాణ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణం కొండమిట్టలో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ నాయకత్వ అవశ్యకతను వివరిస్తూ, గడిచిన 4.5 సంవత్సరాలలో ముఖ్య మంత్రి జగన్ ఈ రాష్ట్ర ప్రజలకు చేస్తున్న మోసాన్ని, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటుకు ఆశీర్వదించాలని ప్రజలను కోరడం జరిగింది. త్రాగు నీరు, డ్రైనేజ్ కాలువల సమస్యను తెలిపారు. ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్య క్రమంలో శ్రీకాళహస్తి పట్టణ ఉపాధ్యక్షులు తోట గణేష్, ప్రధాన కార్యదర్శి పేట చిరంజీవి, రవి కుమార్ రెడ్డి , తొట్టం బేడు మండల ప్రధాన కార్యదర్శి పేట చంద్రశేఖర్, నాయకులు దినేష్, గురవయ్య , రాజేష్, సురేష్, గిరీష్, శ్రీరామ్, వీర మహిళలు కవిత, బతెమ్మ , శారద, సకుంతలమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.