ప్రభుత్వంలోకి వచ్చేది మనమే… వైసీపీ ఓడిపోతుంది

 • జనసేన, టీడీపీ, బీజేపీ కలిస్తే ఏ శక్తీ ఆపలేదు
 • జగన్ కులాలను విచ్ఛిన్నం చేసే వ్యక్తి
 • కుటుంబాలను విడగొట్టాలని చూస్తే… ఆయన కుటుంబమే విడిపోయింది
 • తోడబుట్టిన చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వనివాడు మనకేం మేలు చేస్తాడు
 • బీసీలకు పదవులు కాదు నిర్ణయాధికారం ఇవ్వండి
 • మన పాలనలో లా అండ్ అర్డర్ పటిష్టం చేస్తాం
 • అక్రమ కేసులు బనాయించిన వారిపై చర్యలు తప్పవు
 • భీమవరం నియోజకవర్గం నాయకుల సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్

‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కులాలను విచ్ఛిన్నం చేసే వ్యక్తి. అధికారం, వ్యక్తిగత లబ్ధి కోసం ఎంతటి ఘాతుకానికైనా దిగజారుతారు. బీసీ సాధికారత అని గొప్పలు చెప్పి… కార్పొరేషన్లు అంటూ ఛైర్మన్లు చేశారు తప్ప వాళ్లకు నిర్ణయాధికారం ఇవ్వలేద’ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నా రు. సంఖ్యా బలం ఉన్న కులాల మధ్య సఖ్యత లేకపోవడం వల్లే జగన్ వద్ద దేహీ అని అడుక్కోవాల్సిన దుస్థితి దాపురించిందని, ఈ పరిస్థితి మారాలి… మారుస్తున్నా మని తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్ని కల్లో
వైసీపీ ఓడిపోతుందని, బీజేపీ ఆశీస్సులతో జనసేన-తెలుగుదేశం కూటమే విజయం సాధిస్తుందని చెప్పారు. ఈ ఐదేళ్లు అక్రమ కేసులు బనాయించిన ప్రతి ఒక్కరి లెక్క తేలుస్తామని హెచ్చరించారు. భీమవరం పర్యటనలో భాగంగా బుధవారం నిర్మలాదేవీ ఫంక్షన్ హాల్లో భీమవరం నియోజకవర్గ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “భీమవరం ప్రాంతం నన్ను ప్రజలకు చేరువయ్యేలా చేసింది. ఇదే ఫంక్షన్ హాల్లో అనేక సమావేశాలు నిర్వహించి వేలాది మందిని కలిశాను. ప్రజా సమస్యలు విన్నాను. మనుషులతో మమేకమవ్వడం ఎలాగో భీమవరం నేర్పింది.


• చర్యకు ప్రతిచర్య తప్పదు వైఎస్ జగన్ విధానాలు విచ్ఛిన్నంగా ఉంటాయి . మనం కులాలను కలుపుకొని వెళ్తుంటే… ఆయన విచ్ఛిన్నం చేసుకుంటూ వెళ్తున్నాడు. జగన్ తాలూకు విష సంస్కృతి కుటుంబాల్లోకి
వెళ్లిపోయింది. సొంత అన్నదమ్ములు కూడా తిట్టు కునేలా, కొట్టు కునేలా చేస్తోంది. చర్యకు ప్రతిచర్య ఉంటుందనే న్యూటన్ మూడవ సూత్రం ప్రకారం… మనం సమాజానికి ఏది చూపిస్తామో… మనకు తిరిగి అదే వస్తుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చాలా కష్టపడి వేల కోట్లు సంపాదిస్తే… ఆస్తిలో చెల్లికి వాటా ఇవ్వకుండా ఇంటి నుంచి తరిమేశాడు. తోడబుట్టిన చెల్లికే ఆస్తిలో వాటా ఇవ్వనోడు… మనకి ఎలా మేలు చేస్తాడో ఆలోచించండి.
• సంఖ్యా బలం ఆ కులాలది… అధికారం జగన్ రెడ్డిది శెట్టి బలిజ, గౌడ, దేవాంగులు, కొప్పుల వెలమ, కాళింగులు, నగరాలు, తూర్పు కాపులు, వీళ్లతోపాటు కాపు సామాజకవర్గంలోని ఒంటరి, బలిజ కులాలు సంఖ్యా బలం పరంగా చాలా ఎక్కువ. అయితే వీరి మధ్య సఖ్యత లేకపోవడం వల్ల నేటికీ దేహీ అనే పరిస్థితి దాపురించింది. వీళ్లకు నాలుగైదు పదవులు ఇచ్చి జగన్ అధికారం దక్కించుకుంటున్నా రు. సంఖ్యా బలం ఈ
కులాలది అయితే… అధికారం మాత్రం జగన్ ది. ఈ పరిస్థితి మారాలి. అణగారిన వర్గా లు
సాధికారత ఎలా సాధించాలి? ఆర్థికంగా, సామాజికంగా ఎదగటానికి ఎలాంటి పాలసీలు
తీసుకురావాలని జనసేన ఆలోచిస్తోంది. బీసీలు ఎదగడం అంటే ఓసీలు తగ్గడం కాదు.
• 2016 నుంచి సోషల్ ఇంజినీరింగ్ మొదలుపెట్టాం
కోనసీమలో కాపులకు శెట్టి బలిజలకు పడదు… భీమవరంలో కాపులకు క్షత్రియులకు పడదు… కృష్ణాలో కాపులకు కమ్మవారికి పడదు అంటారు. అసలు ఎందుకు పడదు అనేది ఎవరూ
ఆలోచించరు. కులాలను కలిపే ఆలోచన విధానంతో 2016లో సోషల్ ఇంజినీరింగ్ మొదలు పెట్టాను. కోనసీమలో కాపులు, శెట్టిబలిజలను కూర్చొబెట్టి సమన్వయపరిచాను. సమస్యలు
ఉంటే మాట్లాడుకొని పరిష్కరించేలా ప్రయత్నా లు చేశాము. ఆ ప్రయత్నం ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తుంది. కాపుల వనభోజనాలకు శెట్టిబలిజలు హాజరవుతున్నా రు. శెట్టిబలిజల
వనభోజనాలకు కాపులు హాజరవుతున్నా రు. వాసంశెట్టి సుభాష్ అనే శెట్టిబలిజ సామాజికవర్గా నికి చెందిన యువకుడు, కాపు కులానికి చెందిన గంధం పల్లంరాజు, బాలయోగి గారి
తనయుడు హరీష్ మాధుర్ వీళ్లంతా ఏకమై నేను ఏదైతే చెప్పానో అది.. కులాల మధ్య ఐక్యతను తీసుకొచ్చారు. ఇలాంటి యువకులు ఏ పార్టీలో ఉన్నా అక్కున చేర్చుకుంటాను. వీళ్లే మన
రాష్ట్ర భవిష్యత్తుకు నాయకులు. ఇలాంటి తరానికి మనం అండగా ఉండాలి.
• సమాజానికి ఎలాంటి సంకే తాలు ఇస్తున్నా రు?
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత కులానికి చెందిన తన మాజీ కారు డ్రైవర్ ను చంపి డోర్ డెలివరి చేశాడు. అరెస్టు అయి జైలుకు వెళ్లారు. ఆయన బెయిల్ మీద బయటకు వస్తే
బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఊరేగింపులు చేశారు. ఇలాంటి పనులు చేయడం వల్ల సమాజంలో ఎలాంటి సంకే తాలు పంపిస్తున్నా రు. అనంతబాబు చర్యలతో కాపులు.. దళితులకు
శత్రువులయ్యారు. వ్యక్తి చేసిన తప్పు వల్ల కులంపై ధ్వేషం పెరుగుతోంది. ఇది మారాలి. విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినట్లు అన్ని అనర్ధాలకు మానవ ప్రవృత్తే మూలం తప్ప…
కులం, మతం, ప్రాంతం కాదు. జగన్ కులాలను విడగొడతాడు. కాపులు శెట్టిబలిజలు … శెట్టిబలిజలు, కాపులు, దళితులు… కాపులు, క్షత్రియులు గొడవలు పడాలని చూస్తాడు. మనల్ని
విడగొట్టి సుస్థిరత లేకుండా చేస్తాడు.

• అప్పులు తెచ్చి కాదు… అభివృద్ధి చేసి మగాడివి అనిపించుకో అప్పులు తెచ్చి మగాడిని అనడం ఏంటి? అభివృద్ధి చేసి కదా మగాడివి అనాల్సింది. బటన్లు నొక్కుతున్నా బటన్లు నొక్కుతున్నా అంటున్నా వు. అప్పులు తెచ్చి బటన్లు నొక్కుతున్నావు. అభివృద్ధి చేసి బటన్లు నొక్కు అప్పుడు కదా సలాం కొడతాం. వ్యక్తిగతంగా నీకు ఆస్తులు పెరిగిపోతున్నాయి . జనసేన – టీడీపీ వస్తే పథకాలు ఆపేస్తారు అని దుష్ప్రచారం చేస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చినా పేదలకు సంక్షేమ పథకాలు కొనసాగుతాయి. అయితే సంక్షేమంతోపాటు అభివృద్ధి చేసి చూపిస్తాం. జగన్ అనుచర వర్గా నికి నీచపు లక్షణం ఉంది. సోషల్ మీడియాలో రకరకాలుగా తిట్టిస్తారు. మీరు ఎంత తిట్టినా భయపడి వెనక్కి వెళ్లేది లేదు. నేను ఒక్కడినే నిల్చుంటా. 2014లో నేను ఒక్కడిని నిల్చుంటేనే లక్షలాది మంది సైన్యం కదిలింది. ఒక్కడిని నిల్చుని ఓడిపోయిన పార్టీని నిలబెడితే కష్టాల్లో ఉన్న టీడీపీకి ఓడిపోయిన మనం చెయ్యందించి పైకి లాగాం. దురదృష్టం ఏంటంటే మన దగ్గర ధైర్యం ఉంది, పోరాటం చేసే దమ్ముందిగాని ఎలక్షనీరింగ్ చేసే పరిస్థితి లేదు. నేను రాష్ట్రం కోసం ఓట్లు చీలకుండా బలమైన వ్యూహం తీసుకున్నాం . నాయకులుగా పోటీ చేయడం వేరు గెలవడం వేరు. నేను ఈ సారి గెలుపునే ప్రామాణికంగా తీసుకున్నా . మనకు 18 లక్షల ఓట్లు వచ్చాయి . 2009లో 18 సీట్లు 18 శాతం ఓట్లు వచ్చాయి . వాటిని నిలబెట్టు కోలేకపోయాం. నేను రెండు చోట్ల ఓడిపోయి ఉన్నా , ఎమ్మెల్యే పారిపోయినా పదేళ్లు పార్టీని నిలబెట్టు కున్నాం . ఓట్లు రావడం పోవడం సమస్య కాదు. బలమైన భావజాలంతో లక్షలాది మందిని కట్టిపడేయడమే రాజకీయం అంటే. • కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుంది అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి ఆనాడు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని అన్నా ను. దాని కోసం ఎంతో నలిగిపోయాను. ఎంతో మందితో చీవాట్లు తిన్నాను. పార్టీ ప్రయోజనాల కంటే ప్రజల ప్రయోజనాల కోసం నిలబడ్డాను కనుకే ఈ రోజు అన్ని పార్టీలు ఒక తాటిపైకి తీసుకురాగలిగాను. కూటమికి ఇన్ని సీట్లు వస్తాయి … వైసీపీ ఇన్ని చోట్ల ఓడిపోతుంది అని బెట్టింగులు కడుతున్నా రంటే దానికి కారణం జనసేన. ఓడిపోయినా పారిపోలేదు. బలంగా నిలబడ్డాం. ఇప్పుడు తిరగబడతాం. అలయన్స్ బలంగా కొనసాగాలంటేఎవరైనా కొన్ని త్యాగాలు చేయక తప్పదు. త్యాగాలు చేసిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు వచ్చేలా చూసుకుంటాం. రానున్న కూటమి ప్రభుత్వంలో లా అండ్ అర్డర్ పటిష్టంగా అమలయ్యేలా చేస్తాం. తప్పుడు కేసులు పెట్టిన ఏ ఒక్కరిని మరిచిపోలేదు. గుర్తు పెట్టు కున్నాం . వడ్డీతో సహా తీర్చుకుంటాం. జనసేన, టీడీపీ, బీజేపీ కలిస్తే వైసీపీ దానిని అడ్డుకోలేదు. 2024లో వైసీపీ ఓడిపోతుంది. మనం గెలుస్తున్నాం ” అన్నా రు. ఈ సమావేశంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు, పార్టీ పీఏసీ సభ్యులు శ్రీ కనకరాజు సూరి పాల్గొన్నారు.

 • టీటీడీ బోర్డు మాజీ సభ్యులు శ్రీ గోకరాజు రామంకి పలకరింపు జనసేన పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసిన అనంతరం తిరుగు ప్రయాణంలో భీమవరానికి చెందిన క్షత్రియప్రముఖులు, టీటీడీ బోర్డు
  మాజీ సభ్యులు శ్రీ గోకరాజు రామం గారి ఇంటికి మర్యాదపూర్వక భేటీ నిమిత్తం వెళ్లారు. శ్రీ రామం గారు, ఆయన కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించారు. భీమవరం పర్యటనలో ఒకే రోజు నలుగురు కీలక నేతలతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమావేశం కావడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.