పూతలపట్టు : జగన్ను ఇంటికి పంపాలని ప్రజలు ఎప్పుడో ఫిక్స్ అయ్యారన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. ఆదివారం పూతలపట్టులో జరిగిన జనసేన, టిడిపి సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జగన్ మోహన్ రెడ్డి ధనం, దౌర్జన్యం , దొంగ ఓట్లు అనే ఆయుధాలతో గెలవాలని చూస్తున్నారన్నారు. ధనం, దౌర్జన్యాలకు భయపడాల్సిన అవసరం లేదని, దొంగ ఓట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చి సొంత డబ్బును కౌలు రైతులకు అందించారన్నారు. ఒక్క అవకాశం అన్న జగన్ కు ప్రజలు ఛాన్స్ ఇచ్చారన్నారు. కానీ ఆయన ప్రజలు ఎలాంటి మేలు చేయలేదన్నారు. పూతలపట్టులో జనసేన, టిడిపి అభ్యర్థి అఖండ విజయంతో గెలుస్తారన్నారు.