పాలకొండ నియోజకవర్గం , జనసేన సీనియర్ నాయకులు గర్భాన సత్తిబాబు, జనసేన జిల్లా నాయకులు పెడాడ రామ్మోహన్, పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నిమ్మల నిబ్రమ్, జనసేన నాయకులు కూరంగి నాగేశ్వరరావు, పాలకొండ అయ్యప్ప శన్కర్ హోటల్ నందు జనసేన-తెలుగుదేశం పార్టీల మొదటి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. జనసేన-తెలుగుదేశం పార్టీల ఉమ్మడి భవిష్యత్తు కార్యా చరణ అంశాలపై చర్చించారు. రానున్న రోజుల్లో రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎటువంటి అపోహలు లేకుండా కలిసికట్టుగా కష్టపడి పనిచేసి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మరియు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏర్పడ్డ పొత్తు ఆవశ్యకతను నియోజకవర్గ ప్రజలకు తెలియజేయాలని చర్చించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నుండి నాలుగు మండలాల అధ్యక్షులు మరియు జనసేన పార్టీలో వివిధ హోదాలలో ఉన్న నాయకులు, కార్యకర్తలు మరియు పాలకొండ తెలుగుదేశం పార్టీ , మండల అధ్యక్షులు మరియు జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.