• జిల్లాలవారీగా ఇసుక దోచేస్తున్న వారి వివరాలతో నివేదిక సిద్ధం చేయండి
• పార్టీ నాయకులకు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశం
‘వైసీపీ పాలకులకు ప్రజా క్షేమం, పాలన అనేవి ఏనాడూ పట్టలేదు. వనరులను దోచుకోవడమే ధ్యాస. పాలన మొదలుపెట్టిన తొలి నెలలోనే ఇసుక దోపిడీ కోసమే భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనని కేంద్ర ప్రభుత్వం కూడా హైకోర్టుకు తెలిపిందంటే… వైసీపీ దుర్మార్గం ఏ స్థాయిలో ఉందో ప్రజలందరికీ తెలియచెప్పాలి ’ అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయన్నారు. ఇసుక దోపిడీపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు గురువారం మధ్యాహ్నం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యులతో చర్చించారు. ఈ సందర్భంగా ఇసుక అక్రమ తవ్వకాలపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, నదీ తీరాల వెంబడి భారీ యంత్రాలతో చేస్తున్న దోపిడీ గురించి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. గుంటూరు జిల్లాలో కృష్ణా నదిలో అడ్డగోలుగా తవ్వేయడం వల్ల ఆ గుంతల్లో పడి సుమారు 26 మంది దుర్మరణం పాలయ్యారని తెలిపారు. అదే విధంగా పెదకూరపాడు నియోజకవర్గంలో విలేకరి శ్రీ పరమేశ్వర రావుపై ఇసుక మాఫియా దాడిని తెలియచేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ “పర్యావరణం అనేది పట్టించుకోని పాలన నడుస్తోంది. పర్యావరణాన్ని చెరబట్టి ఇసుకను దోచేస్తున్నారు. ఈ అక్రమాలకు అధికార యంత్రాంగం అడ్డు చెప్పకుండా మిన్నకుండి పోతుంది. ఇలా మౌనంగా ఉంటే అధికారులు కూడా ఇందుకు సంబంధించిన కేసుల్లో బాధ్యులవుతారు. ఇసుక, మద్యం , గనుల్లోని అక్రమార్జనతోనే వైసీపీ ఎన్నికలకు వెళ్లబోతోంది. జిల్లాలవారీగా ఉన్న ఇసుక రీచులు, అక్రమరీచులు, దోపిడీదారుల వివరాలను సేకరించి నివేదిక సిద్ధం చేయండి . పాలకుల దోపిడీని ప్రజల ముందుం చాలి . అక్రమాలను వె లుగులోకి తెస్తు న్న వారిపై దాడి చేయడాన్ ని ప్రతి ఒక్కరూ ఖండిం చాలి . విలేకరి శ్రీ పరమేశ్వ రరావుపై దాడి అప్రజాస్వామికం” అన్నారు.