జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట ్రానికి ముఖ్య మంత్రి కావాలని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు కోరుతున్నారని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. అల్లిపురం నేరెళ్ల కోనేరు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 31,32,34 వార్డులకు చెందిన 100 మంది డాక్టర్ కందుల సమక్షంలో జనసేన పార్టీలోకిచేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ ప్రాంతాలతో పాటు అర్బన్ ప్రాంతాలలో కూడా జనసేన పార్టీకి మరింత క్రేజ్ పెరుగుతుందని చెప్పారు. పార్టీలోకి చేరేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారని తెలియజేశారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న వైసిపి ప్రభుత్వం తీరుపట్ల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. ఒక్క ఛాన్స్ అని అడిగి ప్రజలను మాయమాటలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నేడు ప్రజలను పన్నుల భారంతో అధికధరల భారంతో బాధిస్తుందని చెప్పారు. అలాగే ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికలలో మాత్రం జనసేన టిడిపి కూటమి విజయం సాధించడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గణేష్, పీ. ప్రసాద్, వాసుపల్లి నరేష్, తెలుగు అర్జున్, లోకేష్, సిహెచ్ స్వామి, లలిత, పద్మ, కందుల కేదార్నాథ్, కందులు బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.