జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన అత్యంత గౌరవ మన్నలను స్వీయ ప్రయోజనాలు కోసం దుర్వినియోగం చేసి, పార్టీ ఎదుగుదలకు ఏమాత్రం సహకరించకుండా, పార్టీ నిర్మాణం విషయంలో దృష్టి పెట్టకుండా, గ్రూపు రాజకీయాలకు కేంద్రమై, అయన పైన జనసేనాని పెట్టుకున్న పూర్తి నమ్మకాలకు దెబ్బ కోట్టటం వలన, 2019 ఎన్నికలు తరువాత పూర్తిగా పక్కన పెట్టటం జరిగింది. నాటి నుంచి నేటి వరకు పార్టీలో అయనకు ఎటువంటి ప్రాథాన్యం లేదు.
గత కోంత కాలంగా రాజకీయ నిరుద్యోగంతో ఉన్న వీరు ప్రస్తుతం యుశ్రారైకాపా పంచన చేరటం వలన, కేవలం తిరుపతి ఉప ఎన్నికలు నేపథ్యంలో రాజీనామా అంటూ ఇదోక డ్రామా అడించిన యుశ్రారైకాపా మరియు ప్రభుత్వ పెద్దలు కుయుక్తి ప్రజలు నమ్మరు.
ఇప్పుడు ఈయన చెబుతున్న కారణాలు పూర్తిగా హస్యాస్పదం. బయటకు పోవటానికి ఏదోక వంక కావాలి కాబట్టి, ఏదో పిచ్చ పిచ్చ కారణాలు చెబుతున్నారు. ఈయన కూడా మరోక పరకాల మాత్రమే. కాకపోతే ఈయన వలన జనసేన పార్టీకి ఏమాత్రం నష్టం లేదు, ఇబ్బంది లేదు. గుడ్డి కన్ను తెరిచినా ఒకటే, మూసుకున్నా ఒకటే.